
ఐపీఎల్-2025 సీజన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో భారీ విజయాన్ని ఎస్ఆర్‌హెచ్ అందుకుంది. ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో రాణించగా.. ట్రావిస్ హెడ్, క్లాసెన్ మెరుపులతో సన్‌రైజర్స్ 6 వికెట్ల నష్టానికి ఏకంగా 286 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓ దశలో 300 పరుగుల మార్క్ అందుకునేట్లు కన్పించిన ఆరెంజ్ ఆర్మీ.. ఆఖరి ఓవర్‌లో వికెట్లు కోల్పోవడంతో 286 పరుగుల వద్దే ఆగిపోయింది. అయితే ఈ ఏడాది సీజన్‌లో 300 పరుగుల స్కోర్‌ను సన్‌రైజర్స్ కచ్చితంగా సాధిస్తుందని చాలా మంది మాజీలు అంచనా వేస్తున్నారు.
తాజాగా ఈ జాబితాలోకి సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ చేరాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఏప్రిల్ 17న వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ 300 పరుగుల మార్క్‌ను అందుకుంటుందని స్టెయిన్ జోస్యం చెప్పాడు.
"ఏప్రిల్ 17న మనం ఐపీఎల్‌లో తొలిసారి 300 పరుగుల స్కోర్‌ను చూడబోతున్నాము. వాంఖడేలో సన్‌రైజర్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నాను. అది చూడటానికి నేను ఆ రోజున స్టేడియంలో కూడా ఉండవచ్చు" అని ఎక్స్‌లో స్టెయిన్ రాసుకొచ్చాడు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆడినప్పుడు సన్‌రైజర్స్ ఏకంగా 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఆ మ్యాచ్‌లో హెడ్, అభిషేక్ శర్మ,హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించారు. మొత్తంగా ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ఏకంగా 17 సిక్సర్లు బాదారు. కాగా ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఇప్పటికే నాలుగు సార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు ప్రస్తుతం ఉన్న ఫామ్‌కు 300 పరుగుల స్కోర్ ఆసాధ్యమేమి కాదు. ఎస్‌ఆర్‌హెచ్ తమ రెండో మ్యాచ్‌లో హైదరాబాద్ వేదికగా మార్చి 27న లక్నోతో తలపడనుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అథర్వ తైడె, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్, షమీ, రాహుల్ చాహర్, ఆడమ్ జాంపా, సిమర్‌జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ.
Comments
Please login to add a commentAdd a comment