డేల్ స్టెయిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై | IPL 2025: Dale Steyn steps down as Sunrisers Hyderabad bowling coach | Sakshi
Sakshi News home page

IPL 2025: డేల్ స్టెయిన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ బై

Published Thu, Oct 17 2024 9:24 AM | Last Updated on Thu, Oct 17 2024 9:46 AM

IPL 2025: Dale Steyn steps down as Sunrisers Hyderabad bowling coach

ఐపీఎల్‌-2025 సీజ‌న్‌కు ముందు సన్‌రైజర్స్ హైద‌రాబాద్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఎస్ఆర్‌హెచ్ బౌలింగ్ కోచ్ ప‌ద‌వికి  దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ రాజీనామా చేశాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్టెయిన్ ప్ర‌క‌టించాడు. అయితే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్‌హెచ్ సిస్ట‌ర్ ఫ్రాంచైజీ  సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బౌలింగ్ కోచ్‌గా మాత్రం కొన‌సాగ‌నున్న‌ట్లు స్టెయిన్ తెలిపాడు.

ఐపీఎల్‌లో రెండేళ్ల పాటు బౌలింగ్ కోచ్‌గా పనిచేసే అవ‌కాశ‌మిచ్చినందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ధన్యవాదాలు. ఇక ఐపీఎల్‌లో ఎస్ఆర్‌హెచ్‌తో నా ప్ర‌యాణం ముగించాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అయితే ద‌క్షిణాఫ్రికాలో జ‌రిగే ఎస్ఎ20లో మాత్రం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో కలిసి పని చేయ‌నున్నాను ఎక్స్‌లో స్టెయిన్ గ‌న్ రాసుకొచ్చాడు.

బౌలింగ్ కోచ్‌గా ఫ్రాంక్లిన్‌..
కాగా డేల్ స్టెయిన్ ఐపీఎల్‌-2024 సీజ‌న్‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో దూర‌మ‌య్యాడు. అత‌డి స్ధానంలో తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా  మాజీ న్యూజిలాండ్ ఆల్-రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్‌ను ఎస్ఆర్‌హెచ్ నియ‌మించింది.

ఫ్రాంక్లిన్ హెడ్‌కోచ్  డేనియల్ వెట్టోరితో కలిసి పని చేశాడు. ఐపీఎల్‌-2024లో స‌న్‌రైజ‌ర్స్‌ను  ఈ న్యూజిలాండ్ దిగ్గ‌జాలు ఫైన‌ల్‌కు చేర్చారు. అయితే ఇప్పుడు స్టెయిన్ పూర్తిగా త‌న బాధ్య‌త‌లు నుంచి త‌ప్పుకోవ‌డంతో ఫ్రాంక్లిను రెగ్యూల‌ర్ బౌలింగ్ కోచ్‌గా ఎస్ఆర్‌హెచ్ నియ‌మించే అవకాశ‌ముంది.
చదవండి: LLC 2024: యూసఫ్‌ పఠాన్‌ ఊచకోత.. అయినా పాపం?(వీడియో)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement