ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ చేసింది 49 పరుగులకే అయినా చాలా రికార్డులను కొల్లగొట్టాడు.
- ఐపీఎల్‌లో ఢిల్లీపై 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా (విరాట్ తర్వాత)..
- ఐపీఎల్‌లో ఒకటి అంతకంటే ఎక్కువ ప్రత్యర్దులపై 1000 పరుగుల మార్కును (ఢిల్లీ, కేకేఆర్) తాకిన మూడో ఆటగాడిగా (వార్నర్, కోహ్లి)..
- ఐపీఎల్‌లో 100 క్యాచ్‌లు పట్టిన నాలుగో ఆటగాడిగా (కోహ్లి, రైనా, పోలార్డ్)..
- ఐపీఎల్‌లో ఓ జట్టుపై (ఢిల్లీ) అత్యధిక సిక్సర్లు (46) బాదిన బ్యాటర్‌గా పలు రికార్డులు నెలకొల్పాడు.
► ఇదే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో భారీ రికార్డు కూడా సాధించాడు. టీ20ల్లో 250 విజయాల్లో భాగమైన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
కాగా, ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రోహిత్ శర్మ (27 బంతుల్లో 49; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది.
235 పరుగల భారీ లక్ష్య ఛేదనలో ట్రిస్టన్ స్టబ్స్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 71 పరుగులు నాటౌట్), పృథ్వీ షా (40 బంతుల్లో 66; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) ఢిల్లీని గెలిపించేందు విఫలయత్నం చేశారు. స్టబ్స్ చివరి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment