ఐపీఎల్-2025 మెగా వేలానికి ఆయా ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే తమ ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. ఎవరని రీటైన్ చేసుకోవాలి, ఎవరని వేలంలో విడిచిపెట్టాలన్న అన్న అంశాలపై ఫ్రాంచైజీలు కసరత్తులు మొదలు పెట్టాయి. అయితే ఈసారి మెగా వేలంలో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ మాజీ సారథి రోహిత్ శర్మపై కాసుల వర్షం కురువనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని రోహిత్ శర్మ విడిచిపెట్టనున్నట్లు సమాచారం. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
అప్పటి నుంచి ముంబై ఫ్రాంచైజీ మెనెజ్‌మెంట్ రోహిత్ ఆసంతృప్తితో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ నుంచి బయటకు రావాలని హిట్‌మ్యాన్ నిర్ణయించుకున్నట్లు వినికిడి.
రూ. 50 కోట్లు అయినా ఓకే!
ఇక రోహిత్ శర్మ వేలంలోకి వస్తే ఎలాగైనా అతడిని దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ కాచుకొని ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెవ్ స్పోర్ట్స్‌కు చెందిన రోహిత్ జుగ్లన్ విశ్లేషణ ప్రకారం.. వేలానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ హిట్‌మ్యాన్ ఏకంగా రూ.50 కోట్లు దాచి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
అతడికి తమ జట్టు పగ్గాలను అప్పగించాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు లక్నో ఫ్రాంచైజీ కూడా రోహిత్ కోసం రూ. 50 కోట్లు వెచ్చించడానికి సిద్దంగా ఉందంట.
ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన రికార్డ్ ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంలో అతన్ని రూ. 24.75 కోట్ల భారీ ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. ఐపీఎల్-2025 మెగా వేలం ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment