రోహిత్ శర్మ (PC: IPL.com)
ఐపీఎల్-2024 సీజన్‌కు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నప్పటికీ సంచలనాలు మాత్రం ఇప్పటి నుంచే నమోదు అవుతున్నాయి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్‌గా నిలవగా.. తాజాగా ముంబై తీసుకున్న మరో నిర్ణయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
10 సీజన్ల పాటు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహిరించిన రోహిత్ శర్మపై ముంబై ఇండియన్స్ వేటు వేసింది. రోహిత్ స్ధానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఫ్రాంచైజీ జట్టు పగ్గాలు అప్పగించింది. దీంతో ముంబై తీసుకున్న నిర్ణయంపై సర్వాత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు మాత్రమే కాకుండా ముంబై జట్టులోని ఆటగాళ్లు సైతం ఆసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి రోహిత్ శర్మ..!?
కాగా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత పలు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. రోహిత్ శర్మను ట్రేడింగ్ ద్వారా తమ ఫ్రాంచైజీలోకి ఢిల్లీ క్యాపిటల్స్ ఆహ్హనించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ముంబై ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సంప్రదింపులు జరిపినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
రిషబ్ పంత్ అందుబాటుపై ఇంకా స్పష్టత లేకపోవడంతో వచ్చే సీజన్‌లో రోహిత్ శర్మకు తమ జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఢిల్లీ భావించినట్లు వినికిడి. ఈ క్రమంలోనే ముంబై యాజమాన్యంతో ఢిల్లీ సంప్రదింపులు జరిపినట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ శర్మ కూడా ట్రేడింగ్ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. మరి కొంత మంది అభిమానులు అయితే రోహిత్ సన్‌రైజర్స్ జట్టులోకి రావాలని సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment