ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ కేవలం 27 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్ ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయి. చాలాకాలం తర్వాత ఫ్యాన్స్ పాత రోహిత్‌ను చూశారు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ కొట్టిన సిక్సర్లు నభూతో నభవిష్యతి అన్నట్లు ఉన్నాయి. ఈ షాట్లను చూసేందుకు రెండు కళ్లు చాల లేదు. అయితే హాఫ్‌సెంచరీకి ముందు రోహిత్ అక్షర్ పటేల్‌ను ఎదుర్కొనేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. మూడు డాట్ బాల్స్ అనంతరం అతని బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 13 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1000 పరుగులు (34 మ్యాచ్‌ల్లో 1026 పరుగులు) పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. రోహిత్‌కు ముందు విరాట్ కోహ్లి ఢిల్లీపై 1000 పరుగుల మార్కును తాకాడు. కోహ్లి ఢిల్లీపై 28 ఇన్నింగ్స్‌ల్లోనే 1030 పరుగులు చేశాడు.
ROHIT SHARMA MADNESS AT WANKHEDE 🔥
— Johns. (@CricCrazyJohns) April 7, 2024
- What a player. pic.twitter.com/GCcYwS6b1A
కాగా, ఢిల్లీతో మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు ఇషాన్ కిషన్ (23 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 45 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రొమారియో షెపర్డ్ (10 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. నోర్జే వేసిన ఆఖరి ఓవర్‌లో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment