పాండ్యా (PC: IPL)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే ఓటమి చవిచూశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవిచూసింది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో అనూహ్యంగా ముంబై ఓటమి పాలైంది.
ఆఖరి ఓవర్‌లో ముంబై ఇండియన్స్ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. గుజరాత్ కెప్టెన్ గిల్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్‌కు అప్పగించాడు. మరోవైపు క్రీజులో హార్దిక్ పాండ్యా ఉండడంతో ముంబై డగౌట్‌లో ఇంకా తాము గెలుస్తామన్న థీమా కన్పించింది.
అందుకు తగ్గట్టే హార్దిక్ తొలి రెండు బంతులను వరుసగా సిక్స్, ఫోర్‌గా మలిచాడు. దీంతో ఒక్కసారిగా మ్యాచ్ మొత్తం ముంబై ఇండియన్స్ వైపు మలుపు తిరిగింది. కానీ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చిన ఉమేశ్.. సూపర్ డెలివరీతో హార్దిక్‌ను బోల్తా కొట్టించాడు. మూడో బంతిని స్లో బౌన్సర్‌గా యాదవ్ సంధించాడు. ఈ క్రమంలో హార్దిక్ మరో భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు.
అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి నేరుగా రాహుల్ తెవాటియా చేతికి వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా హార్దిక్ షాక్‌కు గురయ్యాడు. ఈ క్రమంలో డౌగౌట్‌కు నడిచివెళ్తుండగా హార్దిక్ భావద్వోగానికి లోనయ్యాడు. ఉబికి వస్తున్న కన్నీళ్లను హార్దిక్ ఆపున్‌కుంటూ డగౌట్‌కు వెళ్లాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ను రోహిత్ శర్మ ఫ్యాన్స్ టార్గెట్ చేశారు. టాస్ సమయంలో హార్దిక్ మైదానంలో రాగానే రోహిత్ రోహిత్ అంటూ బోయింగ్ చేశారు. అదేవిధంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఫీల్డింగ్ పోజిషన్‌ను హార్దిక్ పాండ్యా పదేపదే మారుస్తూ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు.
అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో హార్దిక్ బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ పరంగా దారుణంగా విఫలయయ్యాడు. ఈ క్రమంలో పాండ్యాను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఆటే అనుకున్నాము.. సీనియర్లకు గౌరవం కూడా ఇవ్వడం రాదా అంటూ తెగ పోస్టులు చేస్తున్నారు. ఇక ఐపీఎల్-2024 సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ తమ జట్టు పగ్గాలను రోహిత్ శర్మ నుంచి హార్దిక్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరి హార్దిక్‌ను తమ జట్టు కెప్టెన్‌గా ముంబై నియమించింది. అప్పటి నుంచి ముంబై ఫ్రాంచైజీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఐదు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ పట్ల ముంబై వ్యవహరించిన తీరును అభిమానులు ఇప్పటికి తప్పుబడుతున్నాడు. ఇప్పటిలో ఈ కెప్టెన్సీ వివాదం సద్దుమణిగేలా కన్పించడం లేదు.
— True Fan (@indiafanofrohit) March 25, 2024
Comments
Please login to add a commentAdd a comment