శ్రీశాంత్‌కు భారీ ఊరట! | Kerala High Court issued notice to BCCI on Sreesanths request | Sakshi
Sakshi News home page

శ్రీశాంత్‌కు భారీ ఊరట!

Published Fri, Mar 3 2017 7:14 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

శ్రీశాంత్‌కు భారీ ఊరట!

శ్రీశాంత్‌కు భారీ ఊరట!

న్యూఢిల్లీ: తనపై విధించిన జీవితకాల నిషేధం తొలగింపుపై అవిశ్రాంతంగా పోరాడుతున్న టీమిండియా పేసర్‌ ఎస్‌.శ్రీశాంత్‌కు ఇది ఊరటనిచ్చే విషయమే.. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సవాల్‌ చేస్తూ బుధవారం అతడు కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ విచారణలో 34 ఏళ్ల కేరళ స్పీడ్‌స్టర్‌కు హైకోర్టు స్వాంతన కలిగించింది. వెంటనే అతడిపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తేయాల్సిందిగా బీసీసీఐకి నోటీసులు పంపింది.

2013లో జరిగిన ఐపీఎల్‌-6 సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. గత నెల 16న శ్రీశాంత్‌ లీగల్‌ నోటీస్‌ పంపినా బీసీసీఐ పట్టించుకోలేదు.

అయితే స్కాటిష్‌ క్లబ్‌ తరఫున లీగ్‌ క్రికెట్‌ ఆడేందుకు తను ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతకంటే ముందుగా ఏప్రిల్‌లో జరిగే ఈ టోర్నీలో ఆడేందుకు బోర్డు నుంచి ఎన్‌ఓసీ తీసుకోవడం తప్పనిసరి. కానీ బోర్డు నుంచి స్పందన కనిపించకపోవడంతో శ్రీశాంత్‌ కోర్టుకెక్కాడు. ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ తనకు వ్యతిరేకంగా ఈ కేసును రూపొందించిందని, అప్పట్లో బోర్డు ప్యానెల్‌ కూడా ఉద్దేశపూర్వకంగానే వ్యతిరేక విచారణ చేపట్టిందని తన అఫిడవిట్‌లో శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement