తేల్చిన సీఎఫ్‌ఎస్‌ఎల్
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మెయ్యప్పన్, బాలీవుడ్ నటుడు విందూ దారా సింగ్‌లు స్పాట్ ఫిక్సింగ్ సందర్భంగా మాట్లాడిన మాటలు.. వారి వాయిస్ శాంపిల్స్‌తో సరిపోయాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) తేల్చింది. దీంతో ఈ కేసులో కొంత పురోగతి రానుంది. ఈ కేసును విచారిస్తున్న ముద్గల్ కమిటీ తమ తుది నివేదికను ఈనెల 30న సుప్రీం కోర్టుకు అందజేయనుంది.
బుకీలకు సమాచారాన్ని చేరవేస్తూ మ్యాచ్‌లపై గురు బెట్టింగ్‌లు కాసేవాడని కమిటీ నివేదికలో గురునాథ్‌పై ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు సీఎఫ్‌ఎస్‌ఎల్ ఫలితం ఈ ఆరోపణలకు కొంత బలాన్ని చేకూర్చనుంది. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడిన అందరి భాగోతాలను పూర్తి స్థాయిలో ఈ నివేదికలో పొందుపర్చినట్లు సమాచారం. నవంబర్ 10న ఈ కేసు విచారణకు రానుంది.
ఆ మాటలు గురునాథ్, విందూలవే!
Published Sat, Oct 25 2014 1:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM
Advertisement
Advertisement