ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ ...
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ చేస్తున్న జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ తమ తుది నివేదికను నవంబర్ 3న సుప్రీం కోర్టుకు అందించనుంది. ‘మా విచారణ నివేదికను 3న సుప్రీం కోర్టు ముందుంచనున్నాం. ఇప్పుడు అంతకు మించి వివరాలేమీ చెప్పను’ అని కమిటీకి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ముద్గల్ తెలిపారు. ఈ కేసుపై 10న సుప్రీంలో విచారణ జరుగనుంది. అటు కోర్టు తీర్పు కోసం బీసీసీఐ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.