సుప్రీంకోర్టుకు ముద్గల్ నివేదిక
10న విచారణ
న్యూఢిల్లీ: ఐపీఎల్-6లో వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై తుది నివేదికను జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసింది. 13 మందిపై ఉన్న ఆరోపణలపై కమిటీ క్షుణ్ణంగా విచారించింది. ఈ మొత్తం నివేదికను జస్టిస్ టీఎస్ ఠాకూర్‌తో కూడిన బెంచ్‌కు సీనియర్ కౌన్సిల్ రాజు రామచంద్రన్ సీల్డ్ కవర్‌లో అందించారు. ఈనెల 10న నివేదికపై విచారణ జరుగుతుందని జడ్జి తెలిపారు. ఈ నివేదికలో ఒక భారత క్రికెటర్ పేరు ప్రస్తావించటంతో పాటు... ధోనికి ఉన్న కంపెనీల గురించి సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రాజ్‌కుంద్రా, మెయ్యప్పన్, విందూసింగ్‌ల పాత్రపై కూడా వివరంగా నివేదిక ఇచ్చినట్లు సమాచారం.