స్పాట్ ఫిక్సింగ్ లో మేయప్పన్ కు ఎదురుదెబ్బ!
స్పాట్ ఫిక్సింగ్ లో మేయప్పన్ కు ఎదురుదెబ్బ!
Published Mon, Feb 10 2014 2:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM
బీసీసీఐ చీఫ్ ఎన్ శ్రీనివాసన్ అల్లుడు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యజమాని గురునాథ్ మేయప్పన్ మళ్లీ కష్టాల్లో పడ్డారు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారంపై జస్టిస్ ముకుల్ ముగ్దల్ కమిటీ సోమవారం నివేదిక సమర్పించింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మేయప్పన్ పాత్ర ఉందంటూ ముగ్దల్ కమిటీ నేరారోపణ చేసింది. ముగ్లల్ కమిటీ నివేదికలో పొందుపరిచిన అంశాలకు మేయప్పన్ సమాధానమివ్వాలని ఆదేశించారు.
మేయప్పన్ క్రికెట్ ఔత్సాహికుడు అంటూ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలను విచారణ కమిటి తిరస్కరించింది. మద్రాస్ హై కోర్టుకు చెందిన ఇద్దరు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ టి జయరామ చౌతా, ఆర్ బాలసుబ్రమణ్యంతో కూడిన దిసభ్య కమిటీ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీహార్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేయడంతో గత సంవత్సరం ముగ్దల్ కమిటిని ఏర్పాటు చేశారు.
గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా ఆటగాళ్లను, జర్నలిస్టులను, జట్టు యాజమాన్యాన్ని, పోలీసులను, అవినీతి నిరోధక ఆధికారులను, వివిధ వ్యక్తులతోపాటు టాప్ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, సౌరవ్ గంగూలీ, ఇతరులను కమిటీ విచారించింది.
Advertisement