'ధోని అబద్ధం చెప్పాడు'
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్‌తో గురునాథ్ మెయ్యప్పన్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఆ జట్టు కెప్టెన్ ఎం.ఎస్.ధోని వ్యాఖ్యలతో ముద్గల్ కమిటీ నివేదిక విభేదించింది. మెయ్యప్పన్ కచ్చితంగా సీఎస్‌కే టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్నారని నివేదిక తేల్చిన విషయం తెలిసిందే. గతంలో ఈ కమిటీ ముందు హాజరైన ధోని... గురునాథ్ కేవలం క్రికెట్ అంటే ఆసక్తితోనే జట్టుతో పాటు ఉన్నాడని, అతడికి ఎలాంటి అధికారం లేదని అబద్ధం చెప్పాడు. తనే కాకుండా ఇండియా సిమెంట్స్ ప్రతినిధులు కూడా గురునాథ్‌కు సీఎస్‌కేలో ఎలాంటి వాటాలు లేవని అబద్దాలు చెప్పినట్లు కమిటీ పేర్కొంది.
మరోవైపు ఈ విషయమై జస్టిస్ ముకుల్ ముద్గల్ మాట్లాడేందుకు నిరాకరించారు. మరోవైపు ధోని ఆస్ట్రేలియా పర్యటన కోసం బ్యాట్లను ఎంపిక చేసుకునేందుకు మంగళవారం మీరట్ వెళ్లాడు. ఒక్కోటి 1260 గ్రాముల బరువున్న ఆరు బ్యాట్లను ఎంపిక చేసుకున్నాడు. అక్కడి పిచ్‌ల స్వభావం దృష్ట్యా బ్యాట్‌లను మార్చాడు.