రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఐదోసారి వాయిదా వేసింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) అధ్యక్ష ఎన్నికల ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు ఐదోసారి వాయిదా వేసింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఎన్నిక లాంఛనమే అయినప్పటికీ ఫలితాలు వెల్లడించకుండా ఉండేందుకు బీసీసీఐ విశ్వప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సుప్రీం ఈ ఫలితాలను ఈనెల 25కు వాయిదా వేసింది.
అదే రోజు ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఉదంతాలపై ముద్గల్ కమిటీ అందించిన నివేదికపై కూడా సుప్రీం కోర్టు మరో బెంచ్ విచారించనుంది. డిసెంబర్‌లో జరిగిన ఆర్‌సీఏ ఎన్నిక ల్లో 33 ఓట్లకు గాను 26 ఓట్లు మోడికి పడినట్టు తమకు తెలుసని గత జనవరిలో బీసీసీఐ లాయర్లు కోర్టుకు తెలిపారు. మోడిపై తాము జీవితకాల నిషేధం విధించామని, ఈ ఎన్నికల్లో పాల్గొనే అర్హత లేదని బోర్డు వాది స్తోంది. అయితే ఆర్‌సీఏ అనేది రాజస్థాన్ క్రీడా చట్టం పరిధిలో ఉంటుందని మోడి వర్గం తిప్పికొడుతోంది.