బ్రిటన్ రాజులనూ వదలని లలిత్ మోదీ
లండన్: మనీ లాండరింగ్ సహా తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ.. బ్రిటన్ రాజకుంటుబాన్ని వదలలేదు. బ్రిటన్ రాజు చార్లెస్, ఆయన సోదరుడు ఆండ్రూ పేర్లు వాడుకుని యూకే హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి లలిత్ మోదీ ట్రావెట్ డాక్యుమెంట్లు పొందినట్టు 'ద సండే టైమ్స్' వెల్లడించింది. క్వీన్ ఎలిజబెత్ రెండో కుమారుడైన ఆండ్రూతో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని లలిత్ ప్రయాణ పత్రాలు పొందారని తెలిపింది. ట్రావెల్ డాక్యుమెంట్స్ తన చేతికి రావడానికి కొన్ని రోజుల ముందే ఆండ్రూను మోదీ కలిశారని వెల్లడించింది.
లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే.