'రేపు ఇంకొకరి పేరు చెబుతారు' | lalit modi creating confusion to rescue himself, says Sadananda Gowda | Sakshi
Sakshi News home page

'రేపు ఇంకొకరి పేరు చెబుతారు'

Published Fri, Jun 26 2015 3:28 PM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

'రేపు ఇంకొకరి పేరు చెబుతారు'

'రేపు ఇంకొకరి పేరు చెబుతారు'

బెంగళూరు: ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానంద గౌడ మండిపడ్డారు. రోజుకొకరి పేరు తెరపైకి తెస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. నిరాధార ఆరోపణలు చేస్తూ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టం నుంచి లలిత్ మోదీ తప్పించుకోలేరని అన్నారు.

'ఈ రోజు ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా పేర్లు బయపెట్టిన లలిత్ మోదీ రేపు ఇంకొకరి పేరు చెబుతారు. ఆ తర్వాత మరొకరి పేరు బయటపెడతారు. గందరగోళం సృష్టించేందుకే ఇదంతా చేస్తున్నారు. దీనిక రాజకీయ కుట్ర ఉన్నట్టు కనబడుతోంద'ని సదానందా గౌడ అన్నారు. లండన్ లో ప్రియాంక, వాద్రాలను కలిశానని ట్విటర్ లో లలిత్ మోదీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement