'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?' | why did u want issue red corner notice to lalith modi: interpole | Sakshi
Sakshi News home page

'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు?'

Published Mon, Sep 7 2015 12:43 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?' - Sakshi

'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?'

న్యూఢిల్లీ: ఇంటర్ పోల్ నుంచి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్కు చుక్కెదురైంది. లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్ పోల్ ఈడీని ప్రశ్నించింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్ పోల్ నుంచి ఈడీకి ఓ లేఖ కూడా అందింది.

ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అతడిని తిరిగి వెనక్కి రప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముందుకు కదిలిన విషయం తెలిసిందే.  ఈడీ కూడా లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్ పోల్ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్ పోల్ ప్రశ్నించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement