లలిత్ మోదీకి ఈడీ నోటీసులు
ఢిల్లీ:ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం సమన్లు జారీ చేసింది.మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగానే మోదీకి ఈడీ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బ్రిటన్ లో ఉంటున్న లలిత్ మోదీ.. అనేక మందిపై వివాదాస్పద ఆరోపణలు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.
లలిత్ మోదీకి బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ అందేందుకు సుష్మా స్వరాజ్, అంతకుముందు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ విషయంలో వసుంధర రాజే సహకరించారన్న వార్తలు వెలుగులోకి రావడంతో భారత్ లో రాజకీయ దుమారం లేచిన విషయం తెలిసిందే.