సాక్షి, ముంబై: ఐపీఎల్ పుణ్యమాని ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒనగూరిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిపై నమోదైన విదేశీ మారక నిల్వల (ఫెమా) కేసు విచారణ సందర్భంగా డివిజన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు జస్టిస్ ధర్మాధికారి, భారతి దంగ్రే వ్యాఖ్యానిస్తూ ‘ఐపీఎల్‌ను విజయవంతం చేశారు సరే. గడిచిన పదేళ్లలో ఆర్థిక అవకతవకలు, కేసుల కంటే ఈ లీగ్ ఆటకెంత మేలు చేసిందో నిర్వాహకులు సమీక్షించుకోవాలి.
ఇప్పటికే ఫిక్సింగ్–బెట్టింగ్‌లతో ఐపీఎల్ బాగా పాపులర్ అయింది. ఈ నేపథ్యంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంక్, ఐపీఎల్ నిర్వాహకులు ఈ లీగ్ క్రికెట్ క్రీడ కోసమా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని అన్నారు. లలిత్ మోడిపై నమోదైన కేసు దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియను తమ మార్గదర్శనంలో చేయాలని ఈడీని ఆదేశించింది. మార్చి 2న మొదలయ్యే ఈ ప్రక్రియను 31లోగా పూర్తి చేయాలని డివిజన్ బెంచ్ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment