interpole
-
స్టార్ క్రికెటర్ కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చానేను ఆచూకీ కనుగొనడం కోసం నేపాల్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. నేపాల్‌కు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సందీప్ లమిచ్చానేపై నేపాల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కాగా నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సందీప్‌పై వేటు వేసిన నేపాల్ క్రికెట్ బోర్డు అతన్ని జట్టులో నుంచి కూడా తొలగించింది. కాగా అప్పటికే సందీప్ లమిచ్చానే కరేబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) ఆడేందుకు జమైకా వెళ్లాడు. కాగా సీపీఎల్‌లో జమైకా తలైవాస్‌కు ఆడుతున్న సందీప్ లమిచ్చానే వ్యవహారం టోర్నీ నిర్వాహకులకు సమాచారం అందడంతో అతన్ని జట్టు నుంచి తొలగించారు. అయితే అప్పటినుంచి స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. దీంతో నేపాల్ పోలీసులు సందీప్ అరెస్ట్ విషయంలో ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. అతని ఆచూకీ కోసం సభ్య దేశాల సహకారం కోరుతూ ఇంటర్‌పోల్ ఆదివారం అతనిపై "డిఫ్యూజన్" నోటీసు జారీ చేసిందని నేపాలీ పోలీసు ప్రతినిధి టెక్ ప్రసాద్ రాయ్ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. ఇంటర్‌పోల్ సహకారం వల్ల సందీప్ లమిచ్చానే అరెస్ట్ చేయగలమన్న నమ్మకం ఉంది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని విచారిస్తే గానీ అసలు నిజం బయటపడదు. అని నేపాల్ పోలీసు ప్రతినిధి తెలిపాడు. అయితే లమిచ్చానే మాత్రం..'' తాను ఏ తప్పు చేయలేదని.. త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి నాపై వచ్చిన ఆరోపణలు తప్పుడువని నిరూపించుకుంటానంటూ'' ఆదివారం సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం. కాగా సందీప్ లమిచ్చానే నేపాల్ జట్టు తరపున స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. నేపాల్ జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన సందీప్ 30 వన్డేల్లో 69 వికెట్లె, 44 టి20ల్లో 85 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో 2018 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సందీప్ 9 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. కాగా గతేడాది చివర్లో జరిగిన వేలంలో సందీప్ లమిచ్చానే అమ్ముడుపోని ఆటగాడిగా మిగిలిపోయాడు. ఇంకో విషయమేంటంటే.. గతేడాది నేపాల్‌లో 2,300 రేప్ కేసులు నమోదైనట్లు నేపాల్ స్థానిక సంస్థ ఒకటి తన రిపోర్టులో పేర్కొంది. చదవండి: ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడిపై అత్యాచార యత్నం కేసు నమోదు జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం -
హెచ్1వీసాల పేరుతో మోసం
-
తెలుగు విద్యార్ధులను నట్టేట ముంచిన జంట..
సాక్షి, హైదరాబాద్: ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ ఓ జంట అమెరికాలోని తెలుగు విద్యార్థులను నట్టేట ముంచింది. స్టూడెంట్స్ వద్ద నుంచి సుమారు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి.. పరారయ్యింది ఈ జంట. వివరాలు.. నిందితులు ముత్యాల సునీల్, ప్రణీతలు అమెరికాలో ఉన్న తెలుగు విద్యార్థులను హెచ్1 వీసా పేరిట మోసం చేశారు. ఎఫ్1 వీసా ఉన్న విద్యార్థులకు హెచ్1 వీసా ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశారు. ఒక్కో విద్యార్థి దగ్గరి నుంచి 25 వేల డాలర్లు వసూలు చేశారు. ఈ మోసానికి సంబంధించి 30 మంది తెలుగు విద్యార్థులు నార్త్ కరోలినా హోం ల్యాండ్ సెక్యూరిటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటర్‌పోల్ ముత్యాల సునీల్, ప్రణీతలపైన లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం సునీల్, ప్రణీత పరారీలో ఉన్నారు. (చదవండి: అమెరికా చదువులకు మన ఖర్చెంతో తెలుసా?) ఇక, విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను సునీల్ తన తండ్రి ముత్యాల సత్యనారాయణ అకౌంట్‌కు బదిలీ చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరిలో ఉంటున్న సత్యనారాయణ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టాడు. ఈ ఘటన వెలుగుచూడటంతో సత్యనారాయణ కూడా పరారీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు సత్యనారాయణ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందపై అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఇటీవలే బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. గుజరాత్లో కొంతమంది పిల్లలను అక్రమంగా నిర్బంధించారని కూడా నిత్యానందపై ఆరోపణలు ఉండటం తెలిసిందే. బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తే ఇంటర్‌పోల్ సభ్య దేశాలు ఆ వ్యక్తి ఆచూకీ, జరిగిన నేరానికి నిందితుడికి మధ్య ఉన్న సంబంధాలపై అదనపు సమాచారం సేకరిస్తాయి. నిత్యానంద ఆనుపానులు తెలుసుకోవాలన్న గుజరాత్ పోలీసుల అభ్యర్థనకు స్పందించిన సీబీఐ ఆ మేరకు ఇంటర్‌పోల్‌కు విజ్ఞప్తిని పంపిందని అహ్మదాబాద్ డీఎస్పీ కె.టి.కమారియా తెలిపారు. నిత్యానందను అరెస్ట్ చేసేందుకు అవసరమైన రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేయించేందుకు ప్రయత్ని స్తున్నట్లు ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌లోని నిత్యా నంద ఆశ్రమం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోవడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఓ వైపు వెదుకుతుండగానే.. నిత్యానంద ఈక్వెడార్ సమీపంలోని ఓ దీవిలో కైలాస అనే పేరుతో హిందూ రాజ్యం స్థాపించినట్లు డిసెంబర్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
ఇంటర్‌పోల్ అధ్యక్షుడు అదృశ్యం
పారిస్: అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ అధ్యక్షుడు మెంగ్ హాంగ్వే(64) అదృశ్యమయ్యారు. సెప్టెంబర్ చివరివారంలో ఫ్రాన్స్‌లోని లియో నుంచి మాతృదేశం చైనాకు చేరుకున్న తర్వాత ఆయన జాడ తెలియరాలేదు. హాంగ్వే ఇంటర్‌పోల్ అధ్యక్ష బాధ్యతలతో పాటు చైనా ప్రజా భద్రత శాఖలో ఉపమంత్రిగా ఉన్నారు. వారం రోజులు గడిచినా హాంగ్వే జాడ తెలియకపోవడంతో ఆయన భార్య ఫ్రాన్స్‌లోని ఇంటర్‌పోల్ అధికారులను ఆశ్రయించింది. అవినీతిపై యుద్ధం పేరుతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలువురు రాజకీయ నేతలు, అధికారులను అరెస్ట్ చేయించిన తెల్సిందే. ఈ నేపథ్యంలో మెంగ్ హాంగ్వేను అధికారులు అదుపులోకి తీసుకుని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2016లో ఇంటర్‌పోల్ చీఫ్‌గా ఎన్నికైన హాంగ్వే ఆ పదవిలో 2020 వరకూ కొనసాగుతారు. పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకోవడానికి రెడ్ నోటీసును, అదృశ్యమైనవారిని గుర్తించడానికి ఇంటర్‌పోల్ యెల్లో నోటీసును జారీచేస్తుంది. చైనా అధికారుల కస్టడీలో హాంగ్వే.. అధికార కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన సెంట్రల్ కమిషన్ ఫర్ డిసిప్లిన్ ఇన్స్పెక్షన్(సీసీడీఐ) అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక కథనం ప్రచురించింది. అవినీతికి పాల్పడటంతో పాటు చైనా, కమ్యూనిస్టు పార్టీకి అవిధేయత చూపిన కేసులను పార్టీ రహస్య విభాగమైన సీసీడీఐ విచారిస్తుంది. లియో నుంచి చైనాలోకి అడుగుపెట్టగానే అయన్ను అవినీతి కేసులో సీసీడీఐ అదుపులోకి తీసుకుందని పేర్కొంది. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారిని ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది. -
'మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు ?'
న్యూఢిల్లీ: ఇంటర్ పోల్ నుంచి ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు చుక్కెదురైంది. లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఎందుకు జారీ చేయాలనుకుంటున్నారో చెప్పాలని ఇంటర్ పోల్ ఈడీని ప్రశ్నించింది. ఈ మేరకు గత నెల 20న ఇంటర్ పోల్ నుంచి ఈడీకి ఓ లేఖ కూడా అందింది. ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అతడిని తిరిగి వెనక్కి రప్పించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ముందుకు కదిలిన విషయం తెలిసిందే. ఈడీ కూడా లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐని కోరింది. దీంతో ఆ నోటీసులు జారీచేసే విషయంలో ఇంటర్ పోల్‌ను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఏప్రాతిపదికన ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారో చెప్పాలంటూ ఇంటర్ పోల్ ప్రశ్నించినట్లు తెలిసింది.