
'నా ఆతిథ్యంతో రాహుల్ -వాద్రాలు లబ్దిపొందారు'
న్యూఢిల్లీ:ట్వీట్ల మీద ట్వీట్లతో రాజకీయ నేతలకు గుబులు పుట్టిస్తున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ... తన ఖాతాలోంచి మరో వికెట్ బయటకు తీశారు. మోదీ గేట్లో రోజుకొక పేరు బయటపెడుతూ గందరగోళం సృష్టిస్తున్న లలిత్ మరో ట్విట్టర్ బాంబ్ పేల్చారు. అంతకుముందు బీజేపీ యువ నాయకుడు వరుణ్ గాంధీని టార్గెట్ చేసిన లలిత్ మోదీ.. ఇప్పుడు నేరుగా రాహుల్ గాంధీని కూడా వివాదంలోకి లాగారు. తన ఆతిథ్యంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లబ్ధిపొందారని పేర్కొన్నాడు. రాహుల్ తో పాటు అతని బావ రాబర్ట్ వాద్రా కూడా తనను కలిసినట్లు స్పష్టం చేశాడు.
ఈ మేరకు శుక్రవారం రాహుల్-వాద్రాలతో కలిసి దిగిన పలు ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ మండిపడ్డారు. లలిత్ అధికార పార్టీ బీజేపీ లబ్ది పొందే క్రమంలో ఇప్పుడు కాంగ్రెస్ నేతలపై టార్గెట్ చేస్తున్నాడని విమర్శించారు.