లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు | Swiss government names Lalit Modi, wife among those facing tax probe | Sakshi
Sakshi News home page

లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు

Jun 1 2016 10:18 AM | Updated on Sep 4 2017 1:25 AM

లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు

లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు

లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్‌ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్‌టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది.

బెర్న్: భారత విచారణ బృందాలకు సమాచారం అందించే అంశంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్‌ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్‌టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దౌత్య సహకారం కోసం సోమవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్లలో ఒకటి లలిత్ మోదీకి, మరొకటి మినాల్ మోదీ అలియాస్ మినాలినీ మోదీకి పంపారు.

వీటిపై స్పందించేందుకు వారికి పదిరోజుల గడువునిచ్చారు. స్విట్జర్లాండ్‌లో వారిద్దరికి సంబంధించిన అధికార ప్రతినిధుల పేర్లను తెలపాలంటూ అందులో కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement