Minal
-
తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్‌ను పెళ్లాడేందుకు లలిత్ ఫైట్.. ఇప్పుడు ఇలా!
Lalit Modi Love Story With Minal: లలిత్ కుమార్ మోదీ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందాడు. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి క్యాష్ రిచ్ లీగ్‌ను సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ20 లీగ్‌లు ఉన్నా ఐపీఎల్ విజయవంతం కావడంలో లలిత్ మోదీదే కీలకపాత్ర అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన లలిత్ మోదీ.. ఒకప్పుడు ప్రపంచంలోని వంద శక్తిమంతుల జాబితాలో కూడా స్థానం సంపాదించడం విశేషం. అయితే, ఎంత వేగంగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నాడో అదే తరహాలో పాతాళానికి దిగజారిపోయాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం నుంచి పారిపోయాడు. ప్రస్తుతం ఆయన లండన్‌లో తలదాచుకుంటున్నాడు. మాజీ విశ్వసుందరితో ప్రేమాయణం! ఇక ఇన్నాళ్లూ పెద్దగా లైమ్‌లైట్‌లో లేని 58 ఏళ్ల లలిత్ మోదీ.. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌తో డేటింగ్ అంటూ ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ బెటర్ పార్ట్నర్ అంటూ చర్చకు తెరలేపాడు. PC: lalit modi Instagram ఈ క్రమంలో వీళ్లిద్దరి పెళ్లి అయి పోయిందని నెటిజన్లు ఫిక్సైపోగా అలాంటిదేమీ లేదని సుస్మిత, లలిత్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేమలో మునిగితేలుతున్నామని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. కాగా 46 ఏళ్ల సుస్మితాసేన్ ఇప్పటికే ఎంతో మందితో డేటింగ్ చేసింది. సుస్మిత రూటు సెపరేటు! స్థాయి.. వయసుతో సంబంధం లేకుండా తన కంటే చిన్నవాళ్లూ, పెద్దవాళ్లతోనూ ప్రణయ బంధం కొనసాగించింది సుస్మిత. కానీ ఎవ్వరికీ తనను వివాహం చేసుకునే అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛాయుత జీవనం గడపడానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం లలిత్‌తో ప్రేమ వ్యవహారం కూడా అలాంటిదేనా.. లేదంటే పెళ్లిదాకా వెళ్తారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. PC: lalit modi Instagram కాగా సుస్మిత ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇక లలిత్‌తో సుస్మిత పరిచయం ఈనాటిది కాదు. లలిత్ మోదీ దివంగత భార్య మినాల్ మోదీకి కూడా ఆమె ఫ్రెండ్ కావడం విశేషం. వీళ్లు ముగ్గురూ కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేవారట. ఇంతకీ మినాల్ ఎవరు? మినాల్ సంగ్రాణి నైజీరియాకు చెందిన సింధీ హిందూ వ్యాపారవేత్త పెసూ అస్వాని కుమార్తె. లలిత్ మోదీతో స్నేహానికి కంటే ముందే ఆమెకు వివాహమైంది. వ్యాపారవేత్త జాక్ సాంగ్రాణిని ఆమె పెళ్లాడింది. వారికి కూతురు సంతానం. అయితే, జాక్ ఓ స్కామ్‌లో ఇరుక్కోవడంతో జైలుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్నాళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంది. PC: lalit modi Instagram లలిత్ కంటే తొమ్మిదేళ్లు పెద్ద! భర్తకు విడాకులిచ్చిన మినాల్తో ప్రేమలో పడ్డ లలిత్ మోదీ ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు. అయితే, మోదీ కుటుంబం ఇందుకు అంగీకరించలేదు. ఆమె డివోర్సీ కావడం ఒక అభ్యంతరమైతే.. లలిత్ కంటే మినాల్ వయసులో దాదాపు తొమ్మిదేళ్లు పెద్దది కావడం మరో కారణం. కుటుంబాన్ని ఎదిరించి! అయినా, అతడు ఆమె చేయిని వీడలేదు. కుటుంబంతో విభేదించాడు. 1991లో మినాల్‌ను పెళ్లిచేసుకున్నాడు. దీంతో తన ఫ్యామిలీకి దూరమయ్యాడు. తమను అందరూ దూరం పెట్టడంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే లలిత్- మినాల్లకు ఇద్దరు సంతానం. PC: lalit modi Instagram కొడుకు రుచిర్, కూతురు అలియా ఉంది. వీరితో పాటు మినాల్ మొదటి కూతురు కరిమా సంగ్రాణిని కూడా చేరదీశాడని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. కాగా క్యాన్సర్ బారిన పడ్డ మినాల్ ఆఖరి వరకు వ్యాధితో పోరాడి 64 ఏళ్ల వయస్సులో 2018లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ సుస్మితతో ప్రేమాయణంతో అటు క్రీడా, ఇటు సినీ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. చదవండి: Ire Vs NZ 3rd ODI: మొన్న టీమిండియాను.. ఇప్పుడు న్యూజిలాండ్‌ను వణికించారు! వరుస సెంచరీలతో.. Ind Vs Eng 2nd ODI: తప్పంతా వాళ్లదే.. అందుకే భారీ మూల్యం.. మైండ్‌సెట్ మారాలి! మూడో వన్డేలో గనుక ఓడితే.. -
వినోదం కోసం పరుగు
యోగేశ్వర్ హీరోగా నటించిన చిత్రం ‘పరారి’. ‘రన్ ఫర్ ఫన్’ అనేది ఉపశీర్షిక. సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివానీ షైనీ, అతిథి హీరోయిన్లుగా నటించారు. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ ‘గరమ్ గరమ్ మురిగి మసాల..’ అనే ప్రత్యేక పాటతో ముగిసింది. ఈ పాటలో యోగేశ్వర్, మినాల్ నటించారు. రవి అంబట్ల రచించిన ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. టీమ్ సహకారం మరవలేనిది’’ అన్నారు యోగేశ్వర్. ‘‘ఫుల్ లెంగ్త్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రమిది. యువతకు చిన్న సందేశం ఇచ్చాం. హైదరాబాద్, బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు సాయి శివాజీ. ‘‘ఇందులో సుమన్‌గారు పోలీసాఫర్ పాత్రలో నటించారు. అలీగారు కీలకమైన పాత్రధారి. వినోదం మాత్రమే కాదు.. సస్పెన్స్, థ్రిల్ అంశాలను కూడా జోడించాం’’ అన్నారు గిరి. ‘‘మంచి అనుభవం ఉన్న యాక్టర్లా నటించాడు యోగేశ్వర్’’ అన్నారు ప్రత్యూష. ‘‘ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. ప్రతి పాట బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్. -
అతడు జాబ్ చెయ్యడు.. ఆమె ఇల్లు చూసుకోదు
మంచి సంప్రదాయాన్ని మొక్కలా నాటి, ఆ మొక్కకు రోజూ నీళ్లుపోస్తున్నారు ఈ నవ దంపతులు! అమ్మాయి, అబ్బాయి పరిచయం కావడం, ఆ పరిచయం స్నేహంగా పరిణమించడం, స్నేహం నుంచి ప్రేమ రెక్కలు విచ్చుకోవడం రొటీన్. అలాంటి రొటీన్ ప్రేమల్లో చాలావరకు పెళ్లి పీటల మీదకు చేరవు. పెళ్లిపీటలను చేరిన ప్రేమల్లోనూ ఆ తర్వాత అంతా రొటీనే. అమ్మాయి పుట్టింటిని వదిలి అత్తవారింట్లో అడుగుపెట్టాలి. అందుకు ఉద్యోగం అడ్డమైతే ఆ ఉద్యోగాన్ని వదిలేయాలి. అంతగా ఆ అమ్మాయికి ఉద్యోగం చేయాలనే కోరిక ఉంటే.. అత్తగారి ఊరిలో లేదా భర్త ఉద్యోగం చేసే ఊరిలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవాలి. అప్పటివరకు తాను ఎదిగిన మెట్లను తానే కూలదోసుకుని కొత్త సోపానాల తొలిమెట్టు మీద నిలబడాలి. అయితే కిషోర్, మినాల్‌ల జీవితమూ అలాంటి మలుపులనే తీసుకుని ఉంటే వారి గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. వీళ్లు ఏన్నో ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాలను బ్రేక్ చేస్తున్నారు. పెళ్లి చేసుకుని భర్త ఇంట్లో అడుగుపెట్టడమే ఎందుకు జరగాలి, భార్య ఇంట్లో భర్త అడుగుపెడితే తప్పేంటి... అని వీరైతే ఎవర్ని ప్రశ్నించడం లేదు కానీ, తామైతే ఆచరిస్తున్నారు! భర్త ఉద్యోగం చేస్తే భార్య ఇంటిని చక్కబెట్టుకోవడంలో ఏ మాత్రం ఎబ్బెట్టు లేనప్పుడు, భార్య ఉద్యోగం చేస్తుంటే భర్త ఇంటి పనులు చక్కబెట్టుకుంటే అది ఎబ్బెట్టు ఎందుకవుతుంది? అన్నది వీళ్ల ఉద్దేశం. హౌస్ వైఫ్ అనిపించుకోవడం ఏమాత్రం గౌరవాన్ని తగ్గించుకోవడం కానప్పుడు, హౌస్ హజ్బెండ్ అనిపించుకోవడం తక్కువ ఎందుకవుతుంది? అని మినాల్ అంటోంది. జైపూర్ అబ్బాయి ఈ కొత్తతరం భార్యాభర్తల్లో అబ్బాయి నంద కిశోర్ కుమావత్ది రాజస్తాన్, జైపూర్‌లో ఉద్యోగం చేసేవాడు. అమ్మాయి పేరు మినాల్ విజయ్ పాండ్సే. ముంబైలోనే పుట్టి పెరిగింది, ముంబైలోనే ఉద్యోగం చేస్తోంది. 2017 నవంబర్ ఎనిమిదవ తేదీన ఆన్లైన్ యాప్‌లో పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆరు రోజులపాటు రోజుకు పన్నెండు గంటల సేపు ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకునేవారు. ఆరో రోజు అతడిని ముఖాముఖి చూడాలనిపించింది మినాల్కి. జైపూర్‌కి టికెట్ బుక్ చేసుకుంది. అతడికి అది సర్ప్రైజ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకున్నారు. రాత్రి జైపూర్‌లో ఆమెను ముంబైకి ట్రైన్‌కి ఎక్కిస్తూ ఒకే ఒక్క మాట.. ‘ఐ వాంట్ యూ ఇన్ మై లైఫ్, ఇట్ యాజ్ ఎ ఫ్రెండ్, లివ్ ఇన్ పార్ట్నర్ ఆర్ వైఫ్’ అన్నాడతడు. మూడవ ఆప్షన్ ఎంచుకుంది మినాల్. 2018 జూలైలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక వాళ్ల సంప్రదాయం ప్రకారం వధువు.. వరుడి ఇంటికి గృహప్రవేశం చేయాలి. ఇక్కడ కిశోర్ మినాల్ ఇంట్లో అడుగుపెట్టాడు. కాలదోషం పట్టిన సంప్రదాయాలను చెరిపేసి కొత్త సంప్రదాయాన్ని అలవాటు చేయడం తమకిష్టం అని చెబుతున్నారు ఈ దంపతులు. ముంబైలో అమ్మాయి జైపూర్‌లో ఉద్యోగానికి రిజైన్ చేశాడు కిశోర్. ముంబైలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రతిచోటా ‘ఆ ఉద్యోగానికి ఎందుకు రిజైన్ చేశారు’ అనే ప్రశ్న ఎదురైంది. ‘భార్య ఇక్కడ (ముంబైలో) ఉద్యోగం చేస్తోంది, అందుకే’ అనే మాట పూర్తయ్యే లోపు నవ్వేశారు కొందరు. ఇందులో అంత విచిత్రం ఏముంది? అని అడుగుతోంది మినాల్. ‘సంపాదించని మగాడిని భర్తగా భరించడం కష్టం, భవిష్యత్తులో అతడు నీకు భారం అవుతాడు. ఈ నిర్ణయం వద్దు’ అని చెప్పారామెకి తల్లిదండ్రులు. రొటీన్‌ని బ్రేక్ చేసి చూపిస్తామంటున్నారు ఈ భార్యాభర్తలు. అయితే మినాల్ సంపాదిస్తుంటే హాయిగా కాలం గడిపేయాలనే బద్ధకంతో హౌస్ హజ్బెండ్ కాలేదతడు. ఇంటిని చూసుకుంటూ చేయగలిగిన వ్యాపారానికి ప్రణాళిక వేసుకుంటున్నాడు. – మంజీర ఉన్నవి రెండే ఆప్షన్లు మేమిద్దరం చెరొక చోట ఉన్నాం. ఒక దగ్గరకు చేరాలంటే రెండే ఆప్షన్లు. ఒకటి.. నేను ఉద్యోగం మానేసి జైపూర్ వెళ్లడం, లేదా కిశోర్ ముంబైకి రావడం. కిశోర్ కాకుండా మరే మగాడైనా నన్ను కెరీర్ వదులుకోమనే చెప్తాడు. వీలుకాదంటే... ఉద్యోగం మన ప్రేమకంటే ఎక్కువా, పెళ్లి కంటే ముఖ్యమా.. అనే ఎమోషనల్ లాజిక్‌తో ఇరుకున పెట్టేవాడు. నన్ను కెరీర్ వదులుకోమని చెప్పకపోవడం కిశోర్ ఔన్నత్యం. – మినాల్ -
లలిత్ మోదీ, ఆయన భార్యకు నోటీసులు
బెర్న్: భారత విచారణ బృందాలకు సమాచారం అందించే అంశంలో ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ, ఆయన భార్య మినాల్‌ల నుంచి సమాధానం కోరుతూ స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం(ఎఫ్‌టీఏ) గెజిట్ నోటిఫికేషన్లను జారీచేసింది. దౌత్య సహకారం కోసం సోమవారం జారీ చేసిన ఈ నోటిఫికేషన్లలో ఒకటి లలిత్ మోదీకి, మరొకటి మినాల్ మోదీ అలియాస్ మినాలినీ మోదీకి పంపారు. వీటిపై స్పందించేందుకు వారికి పదిరోజుల గడువునిచ్చారు. స్విట్జర్లాండ్‌లో వారిద్దరికి సంబంధించిన అధికార ప్రతినిధుల పేర్లను తెలపాలంటూ అందులో కోరారు. మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ పర్యటన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.