వినోదం కోసం పరుగు | Parari Movie Shooting Completed | Sakshi
Sakshi News home page

వినోదం కోసం పరుగు

Published Sun, Aug 18 2019 12:16 AM | Last Updated on Sun, Aug 18 2019 12:16 AM

Parari Movie Shooting Completed - Sakshi

యోగేశ్వర్, మినాల్‌

యోగేశ్వర్‌ హీరోగా నటించిన చిత్రం ‘పరారి’. ‘రన్‌ ఫర్‌ ఫన్‌’ అనేది ఉపశీర్షిక. సాయి శివాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివానీ షైనీ, అతిథి హీరోయిన్లుగా నటించారు. శ్రీ శంకర ఆర్ట్స్‌ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ ‘గరమ్‌ గరమ్‌ మురిగి మసాల..’ అనే ప్రత్యేక పాటతో ముగిసింది. ఈ పాటలో యోగేశ్వర్, మినాల్‌ నటించారు. రవి అంబట్ల రచించిన ఈ పాటకు భాను మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌. ‘‘మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. టీమ్‌ సహకారం మరవలేనిది’’ అన్నారు యోగేశ్వర్‌.

‘‘ఫుల్‌ లెంగ్త్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ చిత్రమిది. యువతకు చిన్న సందేశం ఇచ్చాం. హైదరాబాద్, బ్యాంకాక్‌లో చిత్రీకరణ జరిపాం’’ అన్నారు సాయి శివాజీ. ‘‘ఇందులో సుమన్‌గారు పోలీసాఫర్‌ పాత్రలో నటించారు. అలీగారు కీలకమైన పాత్రధారి. వినోదం మాత్రమే కాదు.. సస్పెన్స్, థ్రిల్‌ అంశాలను కూడా జోడించాం’’ అన్నారు గిరి. ‘‘మంచి అనుభవం ఉన్న యాక్టర్‌లా నటించాడు యోగేశ్వర్‌’’ అన్నారు ప్రత్యూష. ‘‘ఈ సినిమాలో ఆరు పాటలు ఉన్నాయి. ప్రతి పాట బాగా వచ్చింది’’ అన్నారు సంగీత దర్శకుడు మహిత్‌ నారాయణ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement