నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్ | Lalit Modi draws BJP's Sudhanshu Mittal into row | Sakshi
Sakshi News home page

నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్

Published Thu, Jul 2 2015 2:08 PM | Last Updated on Sun, Sep 3 2017 4:45 AM

నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్

నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా బీజేపీ నాయకుడు సుధాంశు మిట్టల్ను బలిపశువుగా చేశారు. ఆయన ఏమీ లేని స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారో త్వరలోనే 'లలిత్గేట్' ద్వారా వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఒకప్పుడు టెంట్వాలాగా ఉండే సుధాంశు మిట్టల్ కథను వచ్చే వారం అందిస్తానని తెలిపారు. ఐపీఎల్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయిన లలిత్ మోదీ.. ఇప్పుడు తాజాగా హవాలా ఆపరేటర్ వివేక్ నాగ్పాల్తో మిట్టల్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు.

'బ్రేకింగ్ న్యూస్' అంటూ మొదలుపెట్టిన ట్వీట్లో.. వివేక్ నాగ్పాల్ అనే హవాలా ఆపరేటర్తో సుధాంశు మిట్టల్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ తర్వాత వరుసపెట్టి మరో రెండు ట్వీట్ అస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ టార్గెట్ చేస్తున్న లలిత్ మోదీ.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతారో, ఎన్ని సంచలనాలకు దారితీస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement