modigate
-
నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా బీజేపీ నాయకుడు సుధాంశు మిట్టల్‌ను బలిపశువుగా చేశారు. ఆయన ఏమీ లేని స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారో త్వరలోనే 'లలిత్‌గేట్' ద్వారా వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఒకప్పుడు టెంట్వాలాగా ఉండే సుధాంశు మిట్టల్ కథను వచ్చే వారం అందిస్తానని తెలిపారు. ఐపీఎల్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయిన లలిత్ మోదీ.. ఇప్పుడు తాజాగా హవాలా ఆపరేటర్ వివేక్ నాగ్‌పాల్‌తో మిట్టల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ మొదలుపెట్టిన ట్వీట్లో.. వివేక్ నాగ్‌పాల్ అనే హవాలా ఆపరేటర్‌తో సుధాంశు మిట్టల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ తర్వాత వరుసపెట్టి మరో రెండు ట్వీట్ అస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ టార్గెట్ చేస్తున్న లలిత్ మోదీ.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతారో, ఎన్ని సంచలనాలకు దారితీస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. Wait 4 details on #racketeer #Tentwala @SudhanshuBJP Rags to #riches story coming live via #LALITGATE in next week pic.twitter.com/PhQbye1jud — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 BREAKING NEWS : WORLD EXCLUSIVE Bought to u by #LALITGATE 🇮🇳 wants to know @SudhanshuBJP what is your relationship pic.twitter.com/ZoB2OsZME9 — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 2/2 with master hawala racketeer and bagman #viveknagpal #Lalitgate #🇮🇳wantstoknowtruth from @SudhanshuBJP pic.twitter.com/oM5ckB1ibX — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 -
'మావాళ్లు మోదీని కలవడం తప్పు కాదు'
తాను లండన్‌లో ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలను కలిశానంటూ లలిత్ మోదీ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఇన్నాళ్లుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌లపై ఈ విషయంలో తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. లలిత్ మోదీ వివాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ స్పందించారు. రాబర్ట్ వాద్రా, ప్రియాంకా గాంధీ ఇద్దరూ ప్రభుత్వంలో భాగం కారని, అందువల్ల వాళ్లు లలిత్ మోదీని కలిసినా తప్పు లేదని డిగ్గీ రాజా వ్యాఖ్యానించారు. అయినా వాళ్లు లలిత్ మోదీని కలవడం పెద్ద నేరమేమీ కాదుగా అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ''ప్రియాంకా గాంధీ ఏదైనా అధికారిక పదవిలో ఉన్నారా.. ఆమె ఎవరికోసమైనా రికమండ్ చేశారా.. ఆమె ఎందుకు తప్పు చేసినట్లవుతుంది?'' అంటూ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించారు. కాగితాల మీద లలిత్ మోదీకి సాయం చేసినవాళ్లు ఇప్పుడు ప్రియాంక, రాబర్ట్ వాద్రాలను తమ రక్షణ కోసం వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. -
అవును.. ఆ సంతకం నాదే: వసుంధర రాజె
-
అవును.. ఆ సంతకం నాదే: వసుంధర రాజె
మోదీ గేట్ కేసులో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె కొంత మేర ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తుకు మద్దతుగా బయటపడిన డాక్యుమెంట్లో సంతకం తనదేనని ఆమె తన పార్టీ అగ్రనేతల వద్ద అంగీకరించినట్లు తాజాగా తెలుస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు ఆమెతో రాజీనామా చేయించే ఆలోచనలో మాత్రం బీజేపీ వర్గాలు కనిపించడంలేదు. ఆ లేఖను తాను వ్యక్తిగత హోదాలో ఇచ్చాను తప్ప.. రాజస్థాన్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా కాదని చెప్పేలా చూస్తున్నారని సమాచారం. లలిత్ మోదీ ఇమ్మిగ్రేషన్ దరఖాస్తును ఆమోదించాలంటూ వసుంధర రాజె ఒక పత్రం మీద సంతకం చేశారని.. నాలుగేళ్ల క్రితం నాటి ఆ పత్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ బుధవారం రాత్రి బయటపెట్టిన విషయం తెలిసిందే. ఏడు పేజీల ఆ డాక్యుమెంటును పార్టీ అగ్రనేతలు క్షుణ్ణంగా పరిశీలించారని, రాజెతో వాళ్లు టచ్‌లోనే ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎల్ కుంభకోణం బయటపడిన తర్వాత విచారణ నుంచి తప్పించుకునేందుకు లలిత్ మోదీ లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. ఆయనకు వీసా ఇప్పించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారని, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె కూడా మద్దతుగా నిలిచారంటూ కాంగ్రెస్ 'మోదీగేట్' కుంభకోణాన్ని ప్రస్తావిస్తోంది. సుష్మ భర్త, కుమార్తె కూడా లలిత్ మోదీ తరఫున న్యాయవాదులుగా వ్యవహరించారు.