Lalitgate
-
బలమైన కేసు ఎందుకు పెట్టలేదు?
జైపూర్/డెహ్రడూన్: ఆర్థిక నేరారోపణలతో విదేశాలకు పారిపోయిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీకి రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వనున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లలిత్ ను తమకు అప్పగించాలని బ్రిటన్ ను కోరనున్నామని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి దమ్ముంటే లలిత్ మోదీని స్వదేశానికి రప్పించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సవాల్ చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. లలిత్ ను స్వదేశానికి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాథోడ్ తెలిపారు. రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. లలిత్ మోదీ విదేశాలకు పారిపోవడానికి యూపీఏ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆయనపై బలమైన కేసు పెట్టివుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదన్నారు. ఫెమా కేసు మాత్రమే పెట్టి యూపీఏ ప్రభుత్వం చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం లేదని, ఎక్కువ శిక్ష కూడా పడదని తెలిపారు. లలిత్ గేట్ వివాదంపై ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. -
నేటి బలిపశువు.. సుధాంశు మిట్టల్
ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ మరో అస్త్రాన్ని బయటకు తీశారు. తాజాగా బీజేపీ నాయకుడు సుధాంశు మిట్టల్‌ను బలిపశువుగా చేశారు. ఆయన ఏమీ లేని స్థాయి నుంచి కోటీశ్వరుడిగా ఎలా ఎదిగారో త్వరలోనే 'లలిత్‌గేట్' ద్వారా వెల్లడిస్తానని ట్వీట్ చేశారు. ఒకప్పుడు టెంట్వాలాగా ఉండే సుధాంశు మిట్టల్ కథను వచ్చే వారం అందిస్తానని తెలిపారు. ఐపీఎల్ కుంభకోణంలో పీకల్లోతు మునిగిపోయిన లలిత్ మోదీ.. ఇప్పుడు తాజాగా హవాలా ఆపరేటర్ వివేక్ నాగ్‌పాల్‌తో మిట్టల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ మొదలుపెట్టిన ట్వీట్లో.. వివేక్ నాగ్‌పాల్ అనే హవాలా ఆపరేటర్‌తో సుధాంశు మిట్టల్‌కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆ తర్వాత వరుసపెట్టి మరో రెండు ట్వీట్ అస్త్రాలు సంధించారు. అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీజేపీని రెండింటినీ టార్గెట్ చేస్తున్న లలిత్ మోదీ.. ఇంకా ఎవరెవరి పేర్లు బయటపెడతారో, ఎన్ని సంచలనాలకు దారితీస్తారోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. Wait 4 details on #racketeer #Tentwala @SudhanshuBJP Rags to #riches story coming live via #LALITGATE in next week pic.twitter.com/PhQbye1jud — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 BREAKING NEWS : WORLD EXCLUSIVE Bought to u by #LALITGATE 🇮🇳 wants to know @SudhanshuBJP what is your relationship pic.twitter.com/ZoB2OsZME9 — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 2/2 with master hawala racketeer and bagman #viveknagpal #Lalitgate #🇮🇳wantstoknowtruth from @SudhanshuBJP pic.twitter.com/oM5ckB1ibX — Lalit Kumar Modi (@LalitKModi) July 1, 2015 -
బీజేపీకి కాంగ్రెస్ ఆసక్తికర ఆఫర్!
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న మోదీ సర్కారుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆసక్తికరమైన 'ఆఫర్' ప్రకటించింది. 'సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలపై వేటు వేయండి. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదించుకోండి' అంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజెలను పదవుల నుంచి తొలగిస్తే పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరిస్తామని 'హస్తం' పార్టీ ఆఫర్ ఇచ్చింది. ఈనెల 21 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉన్న వర్గాలు ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఫలితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా 'లలిత్ గేట్'లో కొట్టుకుపోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
'లలిత్ కళా అకాడమీ తెరిచిన బీజేపీ'
న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న తమ నాయకులను సమర్థించుకుంటున్న బీజేపీపైకి కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు వదులుతూనే ఉంది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు అధికార బీజేపీ 'లలిత్ కళా అకాడమీ' తెరిచిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వదక్కన్ ఎద్దేవా చేశారు. 'లలిత్ గేట్'లో చిక్కుకున్న వారిని ఏవిధంగా రక్షించాలనే దానిపై ఇందులో బీజేపీ అధికార ప్రతినిధులకు శిక్షణనిస్తారని వ్యంగ్యంగా అన్నారు. లలిత్ మోదీ బాధితుడని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బాధితుడయితే రక్షణ కల్పించాల్సి వుంటుందని గుర్తు చేశారు.