బీజేపీకి కాంగ్రెస్ ఆసక్తికర ఆఫర్! | Congress offers Modi govt a deal: Axe Swaraj-Raje, get GST bill nod | Sakshi
Sakshi News home page

బీజేపీకి కాంగ్రెస్ ఆసక్తికర ఆఫర్!

Published Wed, Jul 1 2015 9:49 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

బీజేపీకి కాంగ్రెస్ ఆసక్తికర ఆఫర్! - Sakshi

బీజేపీకి కాంగ్రెస్ ఆసక్తికర ఆఫర్!

న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న మోదీ సర్కారుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆసక్తికరమైన 'ఆఫర్' ప్రకటించింది. 'సుష్మా స్వరాజ్, వసుంధర రాజెలపై వేటు వేయండి. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు ఆమోదించుకోండి' అంటూ కాంగ్రెస్ ప్రతిపాదించింది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజెలను పదవుల నుంచి తొలగిస్తే పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందేందుకు సహకరిస్తామని 'హస్తం' పార్టీ ఆఫర్ ఇచ్చింది.

ఈనెల 21 నుంచి పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆఫర్ ప్రకటించింది. ప్రభుత్వ ఉన్న వర్గాలు ఈ ఆఫర్ ను తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఫలితంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కూడా 'లలిత్ గేట్'లో కొట్టుకుపోయే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement