'లలిత్ కళా అకాడమీ తెరిచిన బీజేపీ' | BJP has opened 'Lalit Kala Academy', says Congress | Sakshi
Sakshi News home page

'లలిత్ కళా అకాడమీ తెరిచిన బీజేపీ'

Published Wed, Jun 24 2015 5:52 PM | Last Updated on Sun, Sep 3 2017 4:18 AM

'లలిత్ కళా అకాడమీ తెరిచిన బీజేపీ'

'లలిత్ కళా అకాడమీ తెరిచిన బీజేపీ'

న్యూఢిల్లీ: 'లలిత్ గేట్'లో చిక్కుకున్న తమ నాయకులను సమర్థించుకుంటున్న బీజేపీపైకి కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు వదులుతూనే ఉంది. లలిత్ మోదీ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కాపాడేందుకు అధికార బీజేపీ 'లలిత్ కళా అకాడమీ' తెరిచిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వదక్కన్ ఎద్దేవా చేశారు. 'లలిత్ గేట్'లో చిక్కుకున్న వారిని ఏవిధంగా రక్షించాలనే దానిపై ఇందులో బీజేపీ అధికార ప్రతినిధులకు శిక్షణనిస్తారని వ్యంగ్యంగా అన్నారు.

లలిత్ మోదీ బాధితుడని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. బాధితుడయితే రక్షణ కల్పించాల్సి వుంటుందని గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement