'బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలు వెల్లడిస్తా' | Lalit modi tweets on ipl issue | Sakshi
Sakshi News home page

'బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలు వెల్లడిస్తా'

Published Mon, Jun 15 2015 8:08 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

ీ: తనకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ స్పందించారు.

న్యూఢిల్లీ: తనకు సహాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చిక్కుల్లో పడిన నేపథ్యంలో ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ స్పందించారు. భారత్లో తనపై చేస్తున్న కుట్రలను గమనిస్తున్నానని, తాను స్పందించాల్సిన సమయం వచ్చిందని మోడీ ట్వీట్ చేశారు. బ్రహ్మాండం బద్దలయ్యే విషయాలెన్నో బయటపెడతానని వెల్లడించారు.

తనపై మీడియా బురదజల్లుతోందని మోడీ  ఆరోపించారు. 2010 నుంచి ఇప్పటి వరకు బీసీసీఐ, ఐపీఎల్లో ఎవరెవరు ఏం చేశారన్న విషయాలన్నింటినీ సవివరంగా బయటపెడతానని మోడీ పేర్కొన్నారు. లలిత్ మోడీ బ్రిటన్ నుంచి ప్రయాణ పత్రాలు(ట్రావెల్ డాక్యుమెంట్స్- టీడీ) పొందేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement