Thalaivi And 83 Movie Makers Announced Biopic On IPL Founder Lalit Modi, Deets Inside - Sakshi
Sakshi News home page

IPL Founder Lalit Modi Biopic: ఐపీఎల్‌ వ్యవస్థాపకుడి బయోపిక్‌ను తెరకెక్కించనున్న బాలయ్య నిర్మాత

Published Mon, Apr 18 2022 4:37 PM | Last Updated on Mon, Apr 18 2022 6:33 PM

Makers Of Thalaivi And 83 Announce Biopic On IPL Founder Lalit Modi - Sakshi

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) వ్యవస్థాపకుడు లలిత్‌ మోడీ జీవితంపై స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్ 'మవెరిక్ కమిషనర్' ద ఐపీఎల్‌- లలిత్‌ మోడీ సాగా అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే పుస్తకం ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య సినిమాల సహా నిర్మాత ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన విష్ణువర్ధన్‌ ఇందూరి లలిత్‌ మోడీ బయోపిక్‌ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు. 


విష్ణువర్ధన్ ఇందూరి.. తమిళనాడు ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవితంపై తలైవీ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలాగే స్పోర్ట్స్ డ్రామా 83 సినిమాకు కూడా ఆయనే నిర్మాతగా వ్యవహరించాడు. ఐపీఎల్ ప్రారంభమై నేటికి 15 సంవత్సరాలు (ఏప్రిల్‌ 18, 2008) అయిన సందర్భంగా విష్ణువర్ధన్‌ ఇందూరి లలిత్‌ మోడీ బయోపిక్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ బయోపిక్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
చదవండి: ఉమ్రాన్‌ మాలిక్‌ స్పీడ్‌కు ఫిదా అయిన కేటీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement