పట్నా: విదే శాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోదీకి వ్యతిరేకంగా పట్నాలోని జిల్లా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భరత్‌సింగ్‌కు శుక్రవారం ఫ్రెండ్ ఆఫ్ బిహారీ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వినయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. కానీ కోర్టు ఈ కేసులో వాదనలు వినేందుకు శనివారం అనుమతి ఇవ్వలేదు. ఈ కేసు విచారణార్హమా కాదా అనే విషయాన్ని మరో రోజు తేలుస్తామని కోర్టు తెలిపింది.
లలిత్ అక్రమాలకు సంబంధించి తన ట్విటర్ ఖాతా ద్వారా ఒకరి పేరు తర్వాత మరొకరి పేరు వెల్లడిస్తూ దేశాన్ని అస్థిరపరచేందుకు ప్రయత్నిస్తున్నారని వినయ్ కుమార్ తన ఫిర్యాదులో ఆరోపించారు. దీనికోసం మీడియాలో వచ్చిన పలు కథనాలను పొందుపరుస్తూ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000, ఐసీసీ 120, 124 సెక్షన్ల కింద ఆయన ఫిర్యాదు చేశారు. సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, లలిత్ మోదీలపై కడమ్ కౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేలా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని వినయ్ కోర్టును అభ్యర్థించాడు.
సుష్మ, రాజే, లలిత్‌లపై ఫిర్యాదు
Published Sun, Jul 5 2015 12:17 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM
Advertisement