ఐపీఎల్! వేల కోట్లలో లావాదేవీలు. పరుగు చేస్తే నోటు, బౌండరీ పడితే కట్ట..గెలిస్తే కోటితో వ్యవహారం అది..! కానీ ఓడినా కోట్లు, నోట్లు వస్తాయండోయ్ అదే ఐపీఎల్‌లో మజా. ఇటువంటి మజాను అందించేలా కార్పొరేట్ క్రికెట్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడే ఈ లలిత్ మోడీ!
కానీ ఐపీఎల్‌ను తన సొంత అవసరాలకు వాడుకొని అప్రతిష్టను మూటగట్టుకున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చివరికి పన్ను ఎగవేత, మనీలాండరింగ్‌లో కేసులో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ 2010 నుంచి లండన్‌లో ఉంటున్నారు.
ఎప్పుడూ వివాదాలు, కొత్త సంచలనాలను వెంట పెట్టుకొని తిరిగే లలిత్ మోడీకి ఆయన తల్లి బీనా మోడీ, ఇతర కుటుంబసభ్యులకు మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది. ఈ వివాదంలో బీనా మోడీ తరుపు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీపై నోరు జారారు. సుప్రీం కోర్ట్ చివాట్లు పెట్టడంతో వెనక్కి తగ్గారు. ఈ తరుణంలో లలిత్ మోడీ ఎక్కడ ఉంటున్నారు? బిజినెస్‌లు ఏమైనా చేస్తున్నారా? చేస్తుంటే ఆయనకి ఎంత ఆస్తి ఉంది? అని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు. (ఓర్నీ వయ్యారం..ఇదేమి ట్రైన్ భయ్యా! ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న వీడియో)
ఐపీఎల్ కుంభకోణం వెలుగులోకి రావడంతో లలిత్ మోడీని బీసీసీఐ నిషేధించింది. కేసులు, విచారణనుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయినా అక్కడ కూడా దర్జాగా బతికేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీడియా ఎప్పుడు ఆయనను పలికరించినా నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టానని చెప్పుకునే లలిత్.. క్రికెట్‌ను వదిలేసినా ఇతర వ్యాపార వ్యవహారాల్ని చక్క బెట్టుకుంటున్నారు. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన)
లలిత్ మోడీ తన కెరీర్‌లో భారీ ఆస్తులే కూడబెట్టారు. పరారీలో ఉన్నప్పటికీ తన తండ్రికి చెందిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌కు అధిపతిగా కొనసాగుతున్నారు. సిగరెట్ తయారీ, విద్య, వ్యవసాయం,ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా అనేక వ్యాపారాలు నిర్వహిస్తున్న మోడీ ఎంటర్‌ప్రైజెస్‌కు అధ్యక్షుడు కూడా. పలు నివేదికల ప్రకారం, 2021లో మోడీ కంపెనీ టర్నోవర్ రూ.1750 కోట్లు. నెలవారీ ఆదాయం దాదాపు రూ.16.5 కోట్లు కాగా, ఆయన వ్యక్తిగత ఆస్తులలో లండన్‌లో 5 అంతస్తుల విలాసవంతమైన ఇల్లు, రూ.12,000 కోట్ల భారీ వ్యాపారం, అనేక లగ్జరీ కార్లు ఉన్నాయని సమాచారం. 2023 నాటికి, భారత్‌లో అతని నికర ఆస్తుల విలువ రూ. 4555 కోట్లకు పైగా ఉందని సమాచారం.
చదవండి👉 ‘మమ్మల్ని ఆదుకోండి సార్’.. రతన్ టాటాకు చేరిన పైలెట్ల పంచాయితీ!
Comments
Please login to add a commentAdd a comment