జైపూర్: రాజస్థాన్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా ఐపీఎల్ మాజీ వివాదాస్పద కమిషనర్ లలిత్ మోడీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. జీవితకాల నిషేధానికి గురైన మోడీ ఎన్నికైన కాసేపటికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను కోర్టు పరిశీలకుడు జైపూర్లో మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు పరిశీలకుడు సీల్డ్ కవర్లో ఉన్న ఓట్లను తెరిచారు. మొత్తం 33 ఓట్లు ఉండగా వాటిలో 26 ఓట్లు లలిత్ మోడీకే దక్కడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఐపీఎల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ ప్రస్తుతం ఇంగ్లండ్లో ఉంటున్నారు. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో రాజస్థాన్ క్రికెట్ సంఘ సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది.
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై బీసీసీఐ వేటు
Published Tue, May 6 2014 3:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:00 AM
Advertisement