Rajasthan cricket association
-
ప్రపంచపు అతిపెద్ద స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ భారీ ఆర్ధిక సాయం
న్యూఢిల్లీ: ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని జైపూర్ పరిసరాల్లో నిర్మించేందుకు రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 75 వేల మంది సీటింగ్సామర్థ్యంతో నిర్మంచ తలపెట్టిన ఈ ప్రాజెక్ట్‌కు.. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రూ.100 కోట్ల భారీ అర్ధిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. అహ్మదాబాద్‌లోని మొతేరా, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్తర్వాత మూడో అతిపెద్ద నిర్మాణంగా ఈ స్టేడియం నిలవనుంది. స్టేడియం నిర్మాణానికి ఇప్పటికే 100 ఎకరాల స్థలాన్ని ఆర్సీఏ లీజుకు తీసుకుంది. నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. జైపూర్శివారులో చోప్గ్రామంలో ఈ మైదానాన్ని నిర్మంచనున్నట్లు ఆర్సీఏ అధికారులు తెలిపారు. ఇందుకోసం రూ.100 కోట్లను బ్యాంకు రుణాల ద్వారా సమకూర్చుకోనున్న ఆర్సీఏ.. మిగతా నిధులను కార్పొరేట్బాక్స్ల విక్రయం ద్వారా సమీకరించనుంది. అత్యాధునిక సౌకర్యాలతో ప్రపంచ స్థాయి వసతులతో కొత్త స్టేడియం రూపుదిద్దుకోనున్నట్లు ఆర్సీఏ పేర్కొంది. ఇందులో ఇండోర్‌గేమ్స్, శిక్షణ అకాడమీలు, క్లబ్ హౌస్, భారీ పార్కింగ్ స్థలం, రెండు ప్రాక్టీస్ గ్రౌండ్లు నిర్మించనున్నట్లు తెలిపింది. స్టేడియం నిర్మాణ పనులను ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రారంభిస్తామని, రెండేళ్ల కాలవ్యవధిలో నిర్మాణం మొత్తాన్ని పూర్తి చేస్తామని ఆర్సీఏ వెల్లడించింది. కాగా, ప్రపంచపు అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాను రూ.800 కోట్లు వచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ఈ గ్రౌండ్ సీటింగ్ కెపాసిటీ లక్షా 10 వేలు. 1,00,024 సామర్థ్యంతో అప్పటిదాకా అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న ఎంసీజీ రికార్డును మొతేరా మైదానం బద్దలు కొట్టింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మైదానాల విషయానికొస్తే.. 1,14,000 సామర్థ్యమున్న ఉత్తర కొరియా రన్‌గ్రాడో మేడే స్టేడియం అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానంలో మొతేరా మైదానం ఉంది. -
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై నిషేదం ఎత్తివేత
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్‌పై కొనసాగుతున్న నిషేదాన్ని ఎత్తి వేసింది. సోమవారం జరిగిన బోర్డు ప్రత్యేక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ప్రకటించారు. ఇక 2014లో రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. హైకోర్టు సూచనలతో ఈ ఏడాది జూన్‌లో మళ్లీ జరిగిన ఎన్నికల్లో లలిత్ మోదీ కుమారుడు రుచిర్ పై కాంగ్రెస్ నేత సీపీ జోషి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇక సుప్రీం నియమించిన బీసీసీఐ పరిపాలకుల కమిటీ రాజస్థాన్ బోర్డు ఏర్పాటు చేసిన అడహక్ కమిటీని రద్దు చేయడంతో నిషేదం ఎత్తివేయడానికి మార్గం సుగమమైంది. ఈ నిషేదంతో ఇప్పటి వరకు రాజస్థాన్‌లో ఎలాంటి అంతర్జాతీయ, దేశావాళి మ్యాచ్‌లను నిర్వహించలేదు. ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లను సైతం జైపూర్‌కు తరలించారు. -
లలిత్ మోదీకి చుక్కెదురు
జైపూర్: విదేశాల్లో ఉంటూనే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ)లో చక్రం తిప్పాలనుకున్న లలిత్ మోదీకి చుక్కెదురైంది. ఆర్సీఏ అధ్యక్షుడిగా పోటీచేసిన లలిత్ తనయుడు రుచిర్ మోదీ ఓటమిపాలయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం వెల్లడైన ఆర్సీఏ ఎన్నికల ఫలితాల్లో.. మోదీ ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సీపీ జోషి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో జోషి 19 ఓట్లు సాధించగా, రుచిర్ మోదీకి కేవలం 14 ఓట్లు మాత్రమే పొలయ్యాయి. అయితే ఆర్సీఏ కార్యదర్శి, కోశాధికారి పదవులు మాత్రం మోదీ అనునాయులకే దక్కడం గమనార్హం. సెక్రటరీగా రాజేంద్ర నందు, ట్రజరర్‌గా పింకేశ్‌జైన్‌లు ఎన్నికయ్యారు. ఐపీఎల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన లలిత్ మోదీ అరెస్ట్ భయంతో కొన్నేళ్ళ కిందటే భారత్ నుంచి పారిపోయిన సంగతి తెలిసిందే. దేశం విడిచివెళ్లే క్రమంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు సహకరించారనే ఆరోపణలున్నాయి. -
లలిత్ మోదీ వారసుడొస్తున్నాడు..
జైపూర్: ఐపీఎల్ బహిష్కృత చైర్మన్ లలిత్ మోదీ కుమారుడు రుచిర్ క్రికెట్ రాజకీయాల్లో క్రీయాశీలకం కానున్నాడు. ఇటీవల అల్వార్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన 22 ఏళ్ల రుచిర్.. రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆర్సీఏ ఎన్నికల్లో గెలిస్తే లలిత్ మోదీ స్థానంలో రుచిర్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుతం ఆర్సీఏ అధ్యక్షుడు లలిత్ మోదీనే. కాగా ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోదీ ఆర్సీఏ అధ్యక్షుడు కావడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆర్‌సీఏను సస్పెండ్ చేసింది. మోదీ పదవి నుంచి తప్పుకున్న తర్వాతే సస్పెన్షన్‌ను ఎత్తివేస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. అంతేగాక మూడేళ్లుగా ఆర్సీఏకు అన్ని రకాల నిధులను ఆపివేసింది. ఈ నేపథ్యంలో మోదీ అనుచరులు రుచిర్ను తెరపైకి తీసుకువస్తున్నారు. ఆర్సీఏ అధ్యక్షుడిగా రుచిర్ ఎన్నికైతే బీసీసీఐ సస్పెన్షన్‌ను తొలగించకతప్పదని మోదీ మద్దతుదారులు భావిస్తున్నారు. లలిత్ మోదీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నాడు. -
ఎక్కడ చెడింది?
‘మోదీగేట్’లో వసుంధర రాజే పేరు తెరపైకి రావడం వెనుక కథ! ‘మోదీగేట్’లో రాజస్తాన్ సీఎం వసుంధర రాజే పేరు హఠాత్తుగా తెరపైకి రావడం వెనుక పెద్ద కథే ఉంది. లలిత్ మోదీ బ్రిటన్ ట్రావెల్ డాక్యుమెంట్స్ పొందేందుకు మాట సాయం చేసిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరే మొదట తెరపైకి వచ్చింది. కానీ హఠాత్తుగా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ల పేర్లు, లలిత్‌తో వారి సాన్నిహిత్యం పతాక శీర్షికలకెక్కాయి. ‘మోదీగేట్’లో రాజే పాత్రను వెల్లడి చేసింది స్వయంగా లలితే. బీసీసీఐలో లలిత్ ప్రస్థానానికి సంపూర్ణ సాయం చేసింది రాజేనే. ఆమె మద్దతుతోనే.. రాజస్తాన్ క్రికెట్ సంఘం నుంచి ప్రారంభించి, బీసీసీఐని శాసించే స్థాయికి లలిత్ ఎదిగారు. ఐపీఎల్ ఆయన బ్రెయిన్ చైల్డే. ఐపీఎల్ వ్యవస్థాపక చైర్మన్ కూడా లలితే. ఐపీఎల్‌తో తారస్థాయికి చేరి.. అదే ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడి అధఃపాతాళానికి చేరాడు. - సెంట్రల్ డెస్క్ లలిత్ వెనుక రాజే.. 2005లో జరిగిన రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్(ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో అప్పటివరకు ఎవరికీ అంతగా తెలియని లలిత్ మోదీ.. అప్పటికే 40 ఏళ్లుగా రాజస్తాన్ క్రికెట్‌ను శాసిస్తున్న రుంగ్తా కుటుంబానికి చెందిన కిషోర్ రుంగ్తాను ఓడించాడు. లలిత్ విజయం వెనుక, తెరవెనుక కృషి అంతా అప్పుడు కూడా సీఎంగా ఉన్న రాజేదే. రాజస్తాన్‌లోని అన్ని జిల్లా క్రికెట్ సంఘాలు, వ్యక్తిగత సభ్యులు అంతా రుంగ్తా కుటుంబానికి విశ్వాసపాత్రులే. దాంతో సీఎంగా అధికారాన్ని ఉపయోగించిన రాజే జిల్లా క్రికెట్ సంఘాలను బెదరించి, రిగ్గింగ్ జరిపి లలిత్ గెలుపునకు బాటలు వేశారని వార్తలు వచ్చాయి. వ్యక్తిగత సభ్యులు కిషోర్త్కు ఓటేయకుండా వారికి ఓటు హక్కుల్ని తొలగిస్తూ ఆర్డినెన్సునే జారీ చేశారు. రాజే కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో లలిత్.. రాజస్తాన్ సూపర్ సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలూ వచ్చాయి. వ్యాపార సంబంధాలు.. 2007లో.. రాజస్తాన్ ప్రభుత్వం సీఎం వసుంధర రాజే కూడా ఒక ప్రమోటర్‌గా అంబర్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీని ప్రారంభించింది. ఆ అథారిటీ పురాతత్వ ప్రాముఖ్యమున్న, 2 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు హవేలీలు.. చాబ్రోంకి హవేలీ(466 గజాలు), బైరాతియోంకి హవేలీ(1,463 గజాలు)లను అంబర్ హెరిటేజ్ సిటీ కన్స్ట్రక్షన్ సంస్థకు కారుచవకగా అమ్మేసింది. చాబ్రోంకిని రూ. 9 లక్షలకు, బైరాంకిని రూ. 21 లక్షలకు అమ్మేసింది. ఆ తరువాత ఆ అంబర్ హెరిటేజ్ సంస్థ.. ఆనంద్ హోటల్స్‌గా పేరు మార్చుకుంది. ఈ ఆనంద్ హోటల్స్ సంస్థ ప్రమోటర్స్ ఎవరో కాదు.. మోదీ, ఆయన భార్య మినాల్. ఈ అంశంతో పలు ఇతర అవినీతి ఆరోపణలూ రావడం రాజే ప్రతిష్టను దిగజార్చింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి అంశంగా ప్రచారం చేపట్టిన కాంగ్రెస్ లలిత్‌ను పవర్ బ్రోకర్‌గా అభివర్ణించింది. ఆ ఎన్నికల్లో రాజే ఓడిపోయారు. మోదీ వర్సెస్ రాజే.. ఆ తర్వాతా లలిత్, రాజేల మధ్య.. వారి కుటుంబాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. ఐపీఎల్ అవకతవకలు బయటపడ్డాక 2013 సెప్టెంబర్‌లో బీసీసీఐ లలిత్‌పై జీవితకాల నిషేధం విధించింది. అయినా, పట్టించుకోని రాజే(2013 ఎన్నికల్లో ఆమె ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం అయ్యారు) 2014 మేలో లలిత్ ఆర్సీఏ అధ్యక్షుడయ్యేలా చూశారు. దాంతో ఆగ్రహించిన బీసీసీఐ ఆర్‌సీఏను సస్పెండ్ చేసింది. దేశవాళీ పోటీల్లో రాజస్తాన్ క్రికెటర్లపై నిషేధం విధించింది. ఆ క్రికెటర్లు హైకోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ఆదేశాల మేరకు వారికి మళ్లీ ఆడే అవకాశం కల్పించారు. ఆ తరువాతే, ఆర్సీఏ ఉపాధ్యక్షుడు అమిన్ పఠాన్ నేతృత్వంలోని మోదీ వ్యతిరేక బృందం రాజేకు దగ్గరైంది. 2014, అక్టోబర్‌లో రాజస్తాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి లలిత్ తొలగింపుతో లలిత్, రాజేల మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. లలిత్ స్థానంలో బీజేపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్, లలిత్‌కు ఒకప్పటి అనుచరుడు అమిన్ పఠాన్ ఆర్సీఏ అధ్యక్షుడు కావడం వెనుక రాజే హస్తం ఉందని లలిత్ భావించాడు. ఆ నియామకాన్ని లలిత్ సవాలు చేయడంతో.. 2015 మార్చిలో ఆర్సీఏ జనరల్ బాడీ సమావేశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి మరీ తొలగించారు. దీనిపై లలిత్ గ్రహం ఆయన ట్వీట్స్‌లో కనిపించింది. ‘నా దగ్గర చాలా మిస్సైల్స్ ఉన్నాయి, జాగ్రత్త’ అని రాజేను ఉద్దేశించి హెచ్చరిస్తూ ట్వీట్ చేశాడు. తర్వాత తన పీఆర్ బృందం ద్వారా.. 2010లో తన బ్రిటన్ ఇమ్మిగ్రేషన్‌కు రాజే సహకరించడానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను మీడియాకు విడుదల చేశాడు. తర్వాత పలు ట్వీట్ల ద్వారా, సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా రాజేను ‘మోదీగేట్’లో భాగం చేశాడు. లలిత్, రాజేల విభేదాలు తీవ్రం కావడానికి కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఒక కారణమన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. -
లలిత్ మోడీకి ఉద్వాసన
జైపూర్: ఐపీఎల్ చైర్మన్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన లలిత్ మోడీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష పదవి నుంచి లలిత్ మోడీని తొలగించారు. సోమవారం జరిగిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో మోడీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రాజస్థాన్ క్రికెట్ సంఘంలో మొత్తం 18 మంది సభ్యులుండగా, 17 మంది మోడీకి వ్యతిరేకంగా ఓటేశారు. రాజస్థాన్ క్రికెట్ సంఘం కొత్త చీఫ్‌గా ఆమిన్ పఠాన్ పేరు ఖరారైంది. ఐపీఎల్లో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగాలపై గతంలో మోడీని చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత బీసీసీఐ, ఐపీఎల్‌కు దూరమయ్యారు. బోర్డు హెచ్చరికలను భేఖాతరు చేస్తూ మోడీ రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనను పదవి నుంచి తొలగించారు. -
దేశవాళీ సీజన్ నుంచి రాజస్థాన్ అవుట్!
ముంబై: తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా లలిత్ మోడిని ఎన్నుకున్నందుకు బీసీసీఐ తగిన చర్యలకు దిగినట్టే కనిపిస్తోంది. వచ్చే దేశవాళీ సీజన్ షెడ్యూల్లో ఆర్‌సీఏను పేర్కొనలేదు. అండర్-16, 19, 23, రంజీ ట్రోఫీ, మహిళల టోర్నీ పోటీల వివరాలతో కూడిన హ్యాండ్‌బుక్‌ను బోర్డు అన్ని గుర్తింపు సంఘాలకు పంపిణీ చేసింది. అయితే ఇందులో రాజస్థాన్ ఊసు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వివిధ అంశాలపై ఆర్‌సీఏతో బీసీసీఐకి విబేధాలున్న విషయం తెలిసిందే. ‘ఆర్‌సీఏను దేశవాళీ సీజన్ నుంచి మేం తొలగించలేదు. వారి కోసం స్లాట్‌ను ఉంచాం. ప్రభుత్వ, బోర్డు అంతర్గత నిర్ణయాలపై ఆధారపడి ఏ విషయాన్నీ ఖరారు చేస్తాం. రాజస్థాన్ ఆటగాళ్లతో పాటు అందరూ ఆడాలనే కోరుకుంటున్నాం. అన్ని సమస్యలు పరిష్కారమై సీజన్లో అన్ని రాష్ట్రాలు ఆడతాయనే ఆశిస్తున్నాను’ అని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ అన్నారు. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే ఇంటర్ స్టేట్ జూనియర్ క్రికెట్ టోర్నీకి ముందు ఆర్‌సీఏపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు బీసీసీఐ హ్యాండ్‌బుక్‌ను తామింకా చూడలేదని ఆర్సీఏ ఉపాధ్యక్షుడు మెహమూద్ అబ్ది పేర్కొన్నారు. క్రికెట్ కార్యకలాపాలకు బింద్రా దూరం చండీగఢ్: 36 ఏళ్లుగా క్రికెట్ పాలనాధికారిగా సేవలందిస్తున్న ఇందర్జిత్ సింగ్ బింద్రా ఇక విశ్రాంతి తీసుకోనున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన బాధ్యతల నుంచి వైదొలిగారు. బింద్రా స్థానంలో డీపీ రెడ్డిని నియమించారు. పీసీఏ రోజువారీ వ్యవహారాలను చూడలేకపోతున్నందుకు తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పీసీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని బింద్రా కోరారు. -
ఆర్సీఏ అధ్యక్షుడిగా లలిత్ మోడి
24-5 ఓట్లతో రాంపాల్‌పై గెలుపు ఫలితాలను ప్రకటించిన రిటైర్డ్ జస్టిస్ కస్లివాల్ కొద్దిగంటల్లోనే ఆర్‌సీఏపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు జైపూర్: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడి... రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాలుగు నెలల కిందట జరిగిన ఎన్నికల ఫలితాలను... కోర్టు నియమించిన పరిశీలకుడు రిటైర్డ్ జస్టిస్ ఎన్.ఎమ్. కస్లివాల్ మంగళవారం ప్రకటించారు. ఈ ఫలితాల్లో మోడి 24-5 తేడాతో తన ప్రత్యర్థి రాంపాల్ శర్మపై విజయం సాధించి అధ్యక్ష పీఠానికి మార్గం సుగమం చేసుకున్నారు. మొత్తం 33 ఓట్లలో రాంపాల్‌కు ఐదు మాత్రమే దక్కాయి. అయితే ఫలితాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే బీసీసీఐ.... మోడికి షాకిచ్చింది. ఆర్‌సీఏపై సస్పెన్షన్ విధిస్తూ కొత్త అంకానికి తెరతీసింది. అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించేందుకు త్వరలో అడ్‌హక్ కమిటీని నియమించనుంది. ఉపాధ్యక్షుడిగా ఆబ్ది ఆర్సీఏ తాజా ఫలితాల్లో ఉపాధ్యక్షుడిగా మహ్మద్ ఆబ్ది; కార్యదర్శిగా సోమేంద్ర తివారీ; కోశాధికారిగా పవన్ గోయల్ ఎన్నికయ్యారు. మోడి లండన్‌లో ఉంటున్నా అసోసియేషన్ కార్యకలాపాలను నిర్వహించే సామర్థ్యం ఆయనకు ఉందని ఆబ్ది అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ను ఉపయోగించుకుని ఎగ్జిక్యూటివ్ కమిటీ ద్వారా కార్యక్రమాలు చేపడతారన్నారు. భారత్‌లో భద్రతా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మోడి ఇక్కడకు వస్తారని చెప్పారు. బీసీసీఐలో శ్రీనివాసన్ ఇంకా జోక్యం చేసుకుంటున్నారని ఆబ్ది ఆరోపించారు. తాత్కాలిక అధ్యక్షులు గవాస్కర్, శివలాల్ యాదవ్... ఆయన గీసిన గీతను దాటడం లేదన్నారు. కోర్టుకెళ్తాం...: ఆర్సీఏ బీసీసీఐ చర్యలపై హైకోర్టును సంప్రదిస్తామని మోడి తరఫు లాయర్ మహ్మద్ ఆబ్ది తెలిపారు. ‘రాష్ట్రంలోని క్రీడా చట్టం ప్రకారం మేం పని చేస్తున్నాం. ఆర్‌సీఏను సస్పెండ్ చేసే హక్కు బీసీసీఐకి లేదు. ఎందుకంటే అది కేవలం రిజిస్టర్డ్ బాడీ మాత్రమే. ఈ విషయాన్ని అన్ని కోర్టుల దృష్టికి తీసుకెళ్తాం. ఒక వ్యక్తిపై కక్ష సాధించేందుకు అసోసియేషన్‌పై నిషేధం విధించడం సరైంది కాదు. ఈ విషయంపై వీలైనంత త్వరగా బీసీసీఐ పత్యేక ఏజీఎమ్ ఏర్పాటు చేయాలని కొంత మంది సభ్యులు కోరుతున్నారు. అక్కడ ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంది’ అని ఆబ్ది వివరించారు. ‘బీసీసీఐలో పాగాకు తొలి అడుగు’ లండన్: ఆర్సీఏ ఎన్నికల్లో గెలవడం... బీసీసీఐలో తిరిగి పాగా వేయడానికి తొలి అడుగు అని మోడి వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా పెద్ద విజయం. ఆర్సీఏలో నెలకొన్న సౌకర్యాలపై గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నా. ఈ గెలుపు మాకు తొలి అడుగు. క్రికెట్‌ను ప్రక్షాళన చేయాలి. ఐపీఎల్ ఫిక్సింగ్పై విచారణ జరిపేందుకు ముద్గల్ కమిటీని నియమించి సుప్రీంకోర్టు మంచి పని చేసింది. ఆర్సీఏ కార్యక్రమాలను మెరుగుపర్చడమే నా ముందున్న లక్ష్యం’ అని మోడి వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా భారత్‌కు తిరిగి వస్తానని చెప్పిన మోడి బీసీసీఐ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అసలు కథ ఇది... ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడని మోడిని బహిష్కరించిన బీసీసీఐ అతనిపై జీవితకాల నిషేధం విధించింది. దీంతో గత నాలుగేళ్లుగా లండన్‌లో నివసిస్తున్న మోడి ఈ అంశంపై చాలాసార్లు కోర్టుల్లో పోరాడినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఆర్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే బోర్డుతో నేరుగా సంబంధాలు జరిపే అవకాశం ఉండటంతో ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ ఎన్నికల్లో పాల్గొనకుండా బీసీసీఐ చాలా విధాలుగా అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. చివరకు సుప్రీం కోర్టు జోక్యంతో ఎన్నికలు సజావుగా ముగిశాయి. ఫలితాల విడుదల్లో జాప్యం జరిగినా చివరకు మోడి అధ్యక్షుడిగా ఎన్నికవడం బోర్డుకు రుచించలేదు. దీంతో సస్పెన్షన్ ఆయుధాన్ని ప్రయోగించింది. ‘సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా బోర్డు నిబంధనలను ఉల్లంఘించినట్లయితే వారిపై చర్య తీసుకునే హక్కు బీసీసీఐకి ఉంది. ఇదే తరహాలో బోర్డు నియమావళిలోని నిబంధన 32 (7) ప్రకారం బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్... ఆర్సీఏ మెంబర్‌షిప్‌ను సస్పెండ్ చేశారు’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ వెల్లడించారు. -
రాజస్థాన్ క్రికెట్ సంఘంపై బీసీసీఐ వేటు
జైపూర్: రాజస్థాన్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా ఐపీఎల్ మాజీ వివాదాస్పద కమిషనర్ లలిత్ మోడీని ఎన్నుకోవడాన్ని వ్యతిరేకిస్తూ బీసీసీఐ రాజస్థాన్ క్రికెట్ సంఘంపై వేటు వేసింది. జీవితకాల నిషేధానికి గురైన మోడీ ఎన్నికైన కాసేపటికే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలను కోర్టు పరిశీలకుడు జైపూర్‌లో మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు పరిశీలకుడు సీల్డ్ కవర్లో ఉన్న ఓట్లను తెరిచారు. మొత్తం 33 ఓట్లు ఉండగా వాటిలో 26 ఓట్లు లలిత్ మోడీకే దక్కడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. ఐపీఎల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నారు. బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించడంతో రాజస్థాన్ క్రికెట్ సంఘ సభ్యత్వం రద్దు చేస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. -
రాజస్థాన్ క్రికెట్ సంఘ అధ్యక్షుడిగా లలిత్ మోడీ
ఐపీఎల్ వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయినా.. రాజస్థాన్ క్రికెట్ సంఘం అద్యక్షుడిగా లలిత్ మోడీ ఎన్నికయ్యారు. గత సంవత్సరం డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను కోర్టు పరిశీలకుడు జైపూర్‌లో మంగళవారం ప్రకటించారు. సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు పరిశీలకుడు సీల్డ్ కవర్లో ఉన్న ఓట్లను తెరిచారు. మొత్తం 33 ఓట్లు ఉండగా వాటిలో 26 ఓట్లు లలిత్ మోడీకే దక్కడంతో ఆయనను విజేతగా ప్రకటించారు. అయితే.. ఆర్సీఏ అధ్యక్ష పదవి మోడీకి అంత సులభంగా ఏమీ దక్కేలా లేదు. న్యాయపరమైన అడ్డంకులతో పాటు.. బీసీసీఐ నిబంధనలు కూడా ఆయనకు అడ్డుపడేలాగే ఉన్నాయి. బీసీసీఐతో పాటు ఆర్సీఏకు కూడా గతంలో అధ్యక్షుడిగా వ్యవహరించిన కిషోర్ రుంగ్తా ఇప్పుడు మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టులో బీసీసీఐకి చుక్కెదురైనా, బోర్డు మాత్రం రాజస్థాన్ క్రీడా చట్టాన్ని సవాలు చేయాలని యోచిస్తోంది. అలా చేస్తే లలిత్ మోడీ రెండోసారి రాజస్థాన్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడు అయ్యే అవకాశం కోల్పోతారు. సస్పెండైన బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో మోడీకి ఏమాత్రం పడకపోవడంతో లలిత్ మోడీ ఇప్పుడు ఇంగ్లండ్‌లో ఉంటున్నారు. శ్రీనివాసన్ కూడా ప్రస్తుతం ఐపీఎల్ కుంభకోణంలో సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కొంటున్నా, బీసీసీఐలో మాత్రం ఆయన బలం బాగానే ఉంది. దాంతో లలిత్ మోడీ తిరిగి భారత క్రికెట్ రాజకీయాల్లోకి రావడం అంత సులభంగా అయ్యేలా లేదు. -
మోడియే గెలుస్తాడని తెలుసు
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిందెవరో సుప్రీం కోర్టు ప్రకటించకముందే బీసీసీఐ చెప్పేసింది. బోర్డు నుంచి జీవితకాల బహిష్కరణ ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడియే విజేత అని స్పష్టం చేసింది. మొత్తం 33 ఓట్లలో 26 ఓట్లు మోడికే పడినట్టు చెప్పింది. అయితే అధికారికంగా ఈ ఫలితాలున్న సీల్డ్ కవర్‌ను తెరవకూడదని... అంతకన్నా ముందు తమ వాదనలు వినాలని కోర్టులో గట్టిగా వాదించింది. దీంతో తదుపరి విచారణ, ఫలితాల వెల్లడిని సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ‘ఆర్సీఏ అధ్యక్షుడిగా గెలిచేదెవరో మాకు తెలుసు. 33 ఓట్లలో 26 ఓట్లు లలిత్ మోడికి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి అతడే విజేత. అయితే అతడు జీవిత కాల బహిష్కరణ ఎదుర్కొంటున్నాడు. పోటీ చేసే అర్హతే తనకు లేదు. ఒకవేళ మోడి ఆర్సీఏ అధ్యక్షుడిగా నెగ్గితే మాకు ఆ సంఘాన్ని సస్పెండ్ చేయడం మినహా మరో దారి లేదు. ఒకవేళ అదే జరిగితే భారత జట్టులో ఉన్న రాజస్థాన్ ఆటగాళ్లు వెంటనే చోటు కోల్పోవాల్సి వస్తుంది’ అని బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే వాయిదా పడుకుంటూ వస్తున్న ఆర్సీఏ ఎన్నికల ఫలితాలను వాస్తవానికి సోమవారం ప్రకటించాల్సి ఉంది. అయితే బోర్డు దీన్ని సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. బీసీసీఐతో పాటు మోడికి వ్యతిరేకంగా పోటీలో నిలిచిన ఆర్పీ శర్మ ఈ ఎన్నికలపై కోర్టులో ఫిర్యాదు చేశారు. అంతకుముందు కోర్టులో ఇరువర్గాల న్యాయవాదుల మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. ఒప్పుకున్నందుకు సంతోషం: మోడి లండన్: ఆర్సీఏ అధ్యక్ష ఎన్నికల్లో తన విజయం బీసీసీఐకి తెలిసినందుకు సంతోషంగా ఉందని లలిత్ మోడి అన్నారు. అయితే అధికారికంగా ఫలితాల వెల్లడి ఆలస్యం కావడంపై విచారం వ్యక్తం చేశారు. -
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వాయిదా
న్యూఢిల్లీ: రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలను సుప్రీం కోర్టు ఈనెల 17 వరకూ వాయిదా వేసింది. దీంతో ఆర్సీఏ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన లలిత్ మోడి భవితవ్యం తేలేందుకు మరో 11 రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఐపీఎల్ చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఒత్తిడి మేరకు లలిత్ మోడిని జీవిత కాలం నిషేధించారు. దాంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం మోడికి లేదు. రాజస్థాన్ స్పోర్ట్స్ యాక్ట్‌లో వున్న వెసలు బాటు మేరకు పోటీ చేసిన మోడి దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారంతో తెలుస్తోంది. అయితే రాజస్థాన్ క్రికెట్ మాజీ కార్యదర్శి కిషన్ రూంగ్టా రాజస్థాన్ స్పోర్ట్స్ యాక్ట్‌ని సవాల్ చేసిన కేసులోనే బిసిసిఐ కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. మోడిని ఎన్నుకుంటే రాజస్థాన్‌ను నిషేధిస్తామంటూ శ్రీనివాసన్ వర్గం హెచ్చరించింది కూడా. కాగా, ప్లేయర్లకు అన్యాయం జరగకుండా రంజీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే వెసలు బాటు కల్పించే చాన్సెస్ వున్నాయి. -
మరో 11 రోజుల్లో తేలనున్నలలిత్ మోడీ భవితవ్యం
జైపూర్ : రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల విడుదలను ఈనెల 17కు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆర్సీఏ ప్రెసిడెంట్‌గా పోటీ చేసిన లలిత్ మోడి భవితవ్యం తేలేందుకు మరో 11 రోజుల పాటు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒకవైపు ఐపీఎల్ చైర్మన్‌గా కొనసాగిన రోజుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ బిసిసిఐ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఒత్తిడి మేరకు లలిత్ మోడిని జీవిత కాలం నిషేధించారు. దాంతో బోర్డు అనుబంధ రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం మోడికి లేదు. రాజస్థాన్ స్పోర్ట్స్ ఏక్ట్‌లో ఉన్న వెసులుబాటు మేరకు పోటీ చేసిన మోడి దాదాపు ఎన్నికయ్యారని అనధికార సమాచారంతో తెలుస్తోంది. అయితే రాజస్థాన్ క్రికెట్ మాజీ కార్యదర్శి కిషన్ రూంగ్టా రాజస్థాన్ స్పోర్ట్స్ ఏక్ట్‌ని సవాల్ చేసిన కేసులోనే బిసిసిఐ కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. మోడిని ఎన్నుకుంటే రాజస్థాన్‌ను నిషేధిస్తామంటూ శ్రీనివాసన్ వర్గం హెచ్చరించింది. కాగా, ప్లేయర్లకు అన్యాయం జరగకుండా రంజీ సహా ఇతర టోర్నీల్లో పాల్గొనే వెసలు బాటు కల్పించే అవకాశాలు వున్నాయి. -
లలిత్ మోడిపైనే చర్చ
చెన్నై: జీవిత కాల నిషేధం ఎదుర్కొంటున్నప్పటికీ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్సీఏ) ఎన్నికల బరిలోకి దిగిన ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి వ్యవహారంపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశంలో చర్చించనుంది. నేడు (శనివారం) చెన్నైలో ఈ సమావేశం జరుగనుంది. ఈనేపథ్యంలో బోర్డు గుర్తింపు పొందిన అన్ని యూనిట్ల ప్రతినిధులు ఈ మీటింగ్‌కు హాజరుకానున్నారు. దీంట్లో మోడి భవితవ్యంతో పాటు ఆర్‌సీఏపై నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిస్థితులపై చర్చ జరిగే వీలుంది. సుప్రీం కోర్టు నియమించిన ఎన్నికల పరిశీలకుడి అనుమతితో మోడి ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధ్యక్షుడిగానూ ఎన్నికయ్యే అవకాశం ఉంది. ‘క్రికెట్‌కు, క్రికెటర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీసీసీఐ ఎప్పటికీ పనిచేయదు. మేం ఏ నిర్ణయం తీసుకున్నా రాజస్థాన్ క్రికెటర్లకు ఎలాంటి సమస్య ఉండబోదు. అలాగే మోడి తిరిగి క్రికెట్ కార్యకలాపాల్లోకి రావాలనే ప్రయత్నంపై కూడా చర్చించనున్నాం. అతడిపై ఏ చర్య అయినా తీసుకునే ముందు అందరి సభ్యుల వాదనను వింటాం’ అని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ అన్నారు. అబ్ది వివరిస్తారు: ఆర్సీఏ జైపూర్: లలిత్ మోడి తమ ఎన్నికల బరిలోకి దిగిన వైనంపై బీసీసీఐ వర్కింగ్ కమిటీ ముందు వాదన వినిపించేందుకు ఆర్సీఏ.. మెహమూద్ అబ్దిని నియమించుకుంది. ‘బీసీసీఐ ప్రజాస్వామిక పద్ధతిలో సమావేశానికి నన్ను అనుమతిస్తుందనే నమ్మకం ఉంది. లేకుంటే ప్రతీ సభ్యున్ని వ్యక్తిగతంగా కలుసుకుని పరిస్థితిని వివరిస్తాను. రాజస్థాన్ క్రీడా చట్టం కింద ఆర్సీఏ నడుస్తోంది కాబట్టి మోడిపై బీసీసీఐ నిషేధం లెక్కలోకి రాదు’ అని అబ్ది తెలిపారు.