రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ విదేశాలకు వెళ్లిపోవడానికి ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహకరించారనే ఆరోపణలు తీవ్రం కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజీనామా చేస్తారని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.