
ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆతడికి కరోనాతో పాటు న్యూమోనియా కూడా సోకింది. ఈ క్రమంలో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్‌పై మోదీ చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా బారిన పడినట్లు లలిత్ మోదీ తెలిపాడు. అంతేకాకుండా న్యూమోనియా కూడా సోకినట్లు అతడు వెల్లడించాడు. మూడు వారాల పాటు క్వారంటైన్‌లో ఉన్నట్లు అతడు చెప్పాడు.
అదే విధంగా ఆరోగ్యం విషమించడంతో మెక్సికో నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్‌కు వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు అతడు పేర్కొన్నాడు. తనకు ఆసుపత్రికి తరలించడానికి సహాయపడిన వాళ్లందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశాడు. లలిత్ మోదీ పోస్ట్‌పై స్పందించిన పలువురు ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్
Comments
Please login to add a commentAdd a comment