IPL Chairman
-
ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే జరుగుతాయని.. సార్వత్రిక ఎన్నికల తేదీలు ఖరారైన వెంటనే షెడ్యూల్ విడుదల ఉంటుందని ఐపీఎల్ చైర్మన్ సింగ్ ధుమాల్ స్పష్టం చేశాడు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ఖరారు చేసిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ విడుదలవుతుందని ధుమాల్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ ఇతర దేశానికి తరలి వెళ్తుందన్న ప్రచారం జరుగుతున్న వేల లీగ్ చైర్మన్ హామీ ఇచ్చాడన్న వార్త భారతీయ క్రికెట్ అభిమానులకు భారీ ఊరట కల్గిస్తుంది. సాధారణంగా భారతలో ఎన్నికలు మార్చి నెలాఖరులో కానీ ఏప్రిల్ తొలి భాగంలో కాని జరుగుతాయి కాబట్టి.. ఈ మధ్య తేదీలను ఐపీఎల్ 2024 ప్రారంభ తేదీగా ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. దేశంలో అత్యంత విశ్వసనీయత కలిగిన వార్తా సంస్థ కథనం మేరకు ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 26న ప్రారంభమై, మే 26వ తేదీతో ముగుస్తుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే,భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పటికీ అన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటికే సన్నాహకాలు మొదలుపెట్టేశాయి. ట్రైనింగ్ క్యాంప్‌లు ప్రారంభించి టెస్ట్ జట్టులో లేని ఆటగాళ్లతో ప్రాక్టీస్ సెషన్స్ కొనసాగిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ లాంటి ఐపీఎల్ స్టార్లు ప్రాక్టీస్ సెషన్స్‌లో నిమగ్నమై ఉన్నారు. -
మహిళల ఐపీఎల్ మార్చి 4 నుంచి ప్రారంభం
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహిళల ఐపీఎల్‌కు (డబ్ల్యూపీఎల్) ముహూర్తం ఖరారైంది. ముంబైలోని బ్రబోర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో మార్చి 4 నుంచి లీగ్ ప్రారంభంకానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ అధికారికంగా ప్రకటించారు. 22 రోజుల పాటు సాగే డబ్ల్యూపీఎల్ మార్చి 26తో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. లీగ్ ఆరంభ మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీల మధ్య జరుగుతుందని తెలిపారు. అలాగే లీగ్‌కు సంబంధించిన వేలం టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అయిపోయిన మరుసటి రోజే (ఫిబ్రవరి 13) ముంబైలో జరుగుతుందని స్పష్టం చేశాడు. కాగా, డబ్ల్యూపీఎల్‌లో పాల్గొనే ఐదు ఫ్రాంచైజీలను ఐపీఎల్ యజమాన్యాలే కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆయా జట్లను సొంతం చేసుకున్న యజమాన్యాల వివరాలు.. అదానీ స్పోర్ట్స్‌లైన్ ప్రైవేట్ లిమిటెడ్ (అహ్మదాబాద్, 1289 కోట్లు)-గుజరాత్ జెయింట్స్ ఇండియా విన్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ముంబై, 912.99 కోట్లు)- ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బెంగళూరు, 901 కోట్లు)- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జేఎస్‌డబ్ల్యూ జీఎంఆర్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ (ఢిల్లీ, 810 కోట్లు)- ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్రీ గ్లోబల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్నో, 757 కోట్లు)-లక్నో సూపర్ జెయింట్స్ -
ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
ఐపీఎల్ మాజీ చైర్మెన్ లలిత్ మోదీ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆతడికి కరోనాతో పాటు న్యూమోనియా కూడా సోకింది. ఈ క్రమంలో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి ఆక్సిజన్ సపోర్ట్‌పై మోదీ చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. రెండు వారాల్లో రెండు సార్లు కరోనా బారిన పడినట్లు లలిత్ మోదీ తెలిపాడు. అంతేకాకుండా న్యూమోనియా కూడా సోకినట్లు అతడు వెల్లడించాడు. మూడు వారాల పాటు క్వారంటైన్లో ఉన్నట్లు అతడు చెప్పాడు. అదే విధంగా ఆరోగ్యం విషమించడంతో మెక్సికో నుంచి ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా లండన్‌కు వచ్చి ఆసుపత్రిలో చేరినట్టు అతడు పేర్కొన్నాడు. తనకు ఆసుపత్రికి తరలించడానికి సహాయపడిన వాళ్లందరికీ మోదీ ధన్యవాదాలు తెలియజేశాడు. లలిత్ మోదీ పోస్ట్‌పై స్పందించిన పలువురు ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చదవండి: చరిత్ర సృష్టించిన 13 ఏళ్ల బాలుడు.. ఏకంగా 508 పరుగులు బాదిన యష్ -
ఆటగాళ్ల రిటెన్షన్‌కు 21 వరకు గడువు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదు పరి సీజన్ కోసం స న్నా హాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్లో కూడా తమ ఫ్రాంచైజీతోనే కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 21 లోగా పంపించాలని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ గురువారం ఫ్రాంచైజీ యజమానులను కోరారు. ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీతో ట్రేడింగ్ విండో గడువు ముగుస్తుందని వెల్లడించారు. 2021 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల మినీ వేలం నిర్వహణ తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు నిర్దేశించిన బడ్జెట్లో ఎలాంటి పెంపుదల లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కరోనా వ్యాప్తి దృష్ట్యా లీగ్ వేదికపై మరో నెల రోజుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. బీసీసీఐ వ్యవహారాలు పర్యవేక్షించడానికి వినోద్ రాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆయనకు పచ్చజెండా ఊపింది. శుక్లాను తొలగించే అవకాశముందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి. రాజీవ్ శుక్లా పదవికి ముప్పు వాటిల్లకపోవడంతో ఐపీఎల్ చైర్మన్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం లేదని తేలిపోయింది. అయితే ఐపీఎల్ పాలక మండలి కార్యకలాపాలను అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ పర్యవేక్షించనుంది. -
ఐపీఎల్ కొత్త చైర్మన్ బిస్వాల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నూతన చైర్మన్‌గా భారత క్రికెట్ జట్టు మాజీ సెలెక్టర్ రంజీబ్ బిస్వాల్ నియమితులయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఆయన పేరును ఖరారు చేశారు. బీసీసీఐ చైర్మన్‌గా మరోసారి ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్‌కు బిస్వాల్ సన్నిహితుడు. ఐపీఎల్ స్పాట్, బెట్టింగ్ ఆరోపణల అనంతరం శుక్లా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన బిస్వాల్ రాజీవ్ శుక్లా స్థానంలో ఐపీఎల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించనున్నారు. గతంలో టీమిండియా మేనేజర్‌గా ఆయన పనిచేశారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చైర్మన్ పదవిలో ఉన్నారు. తాజాగా ఆయన స్థానంలో కేరళకు చెందిన టి.సి.మాథ్యూ బాధ్యతలు చేపట్టనున్నారు. బిస్వాల్ 1987-1996 మధ్య కాలంలో ఒడిశా తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడారు.