
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదు పరి సీజన్ కోసం స న్నా హాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్‌లో కూడా తమ ఫ్రాంచైజీతోనే కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 21 లోగా పంపించాలని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ గురువారం ఫ్రాంచైజీ యజమానులను కోరారు. ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీతో ట్రేడింగ్ విండో గడువు ముగుస్తుందని వెల్లడించారు. 2021 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల మినీ వేలం నిర్వహణ తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు నిర్దేశించిన బడ్జెట్‌లో ఎలాంటి పెంపుదల లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కరోనా వ్యాప్తి దృష్ట్యా లీగ్ వేదికపై మరో నెల రోజుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment