Action committee
-
కిం కర్తవ్యం?.. ఇప్పుడేం చేద్దాం..
సాక్షి, నంద్యాల జిల్లా: స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపు(శుక్రవారం) నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ నుంచి నారా లోకేష్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా?. లోకేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.?. లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా?. ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా?. చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?. భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు?. ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా?. అనే దానిపై చర్చించనున్నట్లు తెలిసింది. లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా?, బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్‌లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు?. జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు?. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు?’’ అనేది హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం -
అరుదైన బౌల్.. ధర 3.6 కోట్లు!
ఓ పింగాణీ బౌల్ ధర ఎంతుంటుంది. మహా అయితే ఓ వంద, లేదంటే ఓ వెయ్యి రూపాయల వరకూ ఉండొచ్చు. మరింత కళాత్మకమైతే మరికాస్త ఎక్కువగా ధర పలకవచ్చు. కానీ అమెరికాలో వేలానికి వచ్చిన ఓ పింగాణీ బౌల్ ధర చూస్తే.. కళ్లు చెదరక మానవు. ఆ బౌల్ ధర సింపుల్‌గా రూ. 3.6 కోట్ల వరకూ ఉంటుందని వేలంపాట నిర్వాహకులు అంచనా వేశారు. ఎందుకు ఇంత ధర అంటే.. ఆ పాత్రకు కనీసం ఆరు వందల ఏళ్ల వయసు ఉంటుందట. ఈ పురాతన కప్పును ఈనెల 17న న్యూయార్క్‌లో సోథేబీ కంపెనీ వేలంపాటలో విక్రయించనుంది. అది చైనీస్ కప్పు కనెక్టికట్‌కు చెందిన ఓ పాత వస్తువుల వ్యాపారి గతేడాది ఆ బౌల్‌ను రూ. 2,500కు కొనుగోలు చేశాడు. కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాక దానిలో ఏదో ప్రత్యేకత ఉందని కనిపెట్టాడు. వెంటనే సోథేబీ కంపెనీని సంప్రదించాడు. ఆ బౌల్ చరిత్ర చెప్పాలని, విలువ కట్టాలని కోరాడు. బౌల్‌ను పరిశీలించిన కంపెనీ వాళ్లు కంగుతిన్నారు. ఇది అరుదైన బౌల్ అని, వేలం వేస్తే 5 లక్షల డాలర్ల వరకూ పలుకుతుందని చెప్పారు. దీంతో ఆ వ్యాపారి ఉబ్బితబ్బిబయ్యాడు. ఆ పాత్రను లోటస్ బౌల్‌గా పిలుస్తారు. ఆ బౌల్ 1403 నుంచి 1424 వరకూ చైనాను ఏలిన యోంగిల్ చక్రవర్తి కాలం నాటిది. ఇలాంటి కప్పులు మరో ఆరు మాత్రమే ఇప్పుడు ఉన్నాయని సోథేబీ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. తైపీలోని నేషనల్ మ్యూజియంలో రెండు, లండన్ మ్యూజియంలో రెండు, టెహ్రాన్ మ్యూజియంలో ఒకటి అలాంటి కప్పులు ఉన్నాయట. అందమైన ఆర్టు అందమైన ఆర్టుతో ఉన్న ఈ బౌల్‌ను చూస్తే.. వావ్ అద్భుతం అనకుండా ఉండరేమో. 6 అంగుళాల తెల్లటి పాత్ర లోపల, బయటా నీలం రంగులో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల బొమ్మలతో ఆకట్టుకుంటుంది. ఆ బౌల్‌ను పట్టుకుంటే ఎంతో సున్నితంగా, సిల్కును తలపిస్తోంది. 15వ శతాబ్దపు రంగులు, డిజైన్లు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ పాత్ర ఎంతో అద్భుతంగా ఉందని సోథేబీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మెక్ అటీర్ అన్నారు. పాత్ర పెయింటింగ్, షేప్ ఎంతో యునిక్‌గా ఉందని ఆయన ముచ్చట పడుతూ చెప్పారు. ఇంత పురాతన వస్తువు పాత వస్తువుల వ్యాపారి వద్దకు ఎలా వచ్చిందనేది తెలియడం లేదన్నారు. తరతరాలుగా వారసుల చేతులు మారుతూ ఇక్కడికి వచ్చి ఉంటుందని, దాని విలువ తెలియక పోవడంతో వారు అమ్మేసుకుని ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వస్తువులు ఇంకా ఉండటం సంతోషమని, దాని వేలం నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామని తెలిపారు. -
నేడు ఐపీఎల్ వేలం
చెన్నై: ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఫ్రాంచైజీల ఫేవరెట్‌గా మారాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని చేజిక్కించుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇరు ఫ్రాంచైజీలు పోటీపడితే మాత్రం అతనిపై కోట్లు కురిసే అవకాశముంది. మ్యాక్సీతో పాటు ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, ఇతని సహచరుడు, నంబర్‌వన్ టి20 బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్‌లు కూడా వేలంలో చెప్పుకోదగ్గ ధర పలకొచ్చు. వేలానికి వెయ్యిమందికి పైగా ఆటగాళ్లు ఆసక్తి చూపగా... వడపోత అనంతరం చివరకు 292 మంది వేలంలోకి వచ్చారు. ఇందులో 164 మంది భారత ఆటగాళ్లయితే... 125 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. మరో ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన ఆటగాళ్లు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలుండగా... ఈ ఫ్రాంచైజీ చేతిలో రూ. 35.40 కోట్లు మిగిలున్నాయి. అతి తక్కువగా మూడే ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇందుకోసం రూ. 10.75 కోట్లు అందుబాటులో ఉన్నాయి. -
ఆటగాళ్ల రిటెన్షన్‌కు 21 వరకు గడువు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదు పరి సీజన్ కోసం స న్నా హాలు మొదలయ్యాయి. వచ్చే సీజన్లో కూడా తమ ఫ్రాంచైజీతోనే కొనసాగే ఆటగాళ్ల జాబితాను ఈ నెల 21 లోగా పంపించాలని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ గురువారం ఫ్రాంచైజీ యజమానులను కోరారు. ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఫిబ్రవరి 8వ తేదీతో ట్రేడింగ్ విండో గడువు ముగుస్తుందని వెల్లడించారు. 2021 సీజన్‌కు సంబంధించిన ఆటగాళ్ల మినీ వేలం నిర్వహణ తేదీని ఇంకా నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఫిబ్రవరి రెండో లేదా మూడో వారంలో ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలకు నిర్దేశించిన బడ్జెట్లో ఎలాంటి పెంపుదల లేదని స్పష్టం చేశారు. భారత్‌లో కరోనా వ్యాప్తి దృష్ట్యా లీగ్ వేదికపై మరో నెల రోజుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
జోనల్ వ్యవస్థ రద్దు తగదు
చేవెళ్ల రూరల్: జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తప్పు బట్టింది. జోనల్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు జోన్ల సంఖ్యను ఆరుకు పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. చేవెళ్ల మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చర్చ వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ జోనల్ రద్దుతో నిరుద్యోగులతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు మరింతగా వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ జిల్లాను ఒక జోన్గానూ, మిగతా జిల్లాలను ఐదు జోన్లుగా విభజించాలని కోరారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు అన్ని జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. జోన్ల సంఖ్యను పెంచడానికి నిపుణులతో కమిటీ వేసి పునర్‌వ్యవస్థీకరిచాలని...అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య, స్థానిక ఎంఈఓ సుజాత, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మానిక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గాలయ్య, జిల్లా కార్యదర్శి రవీందర్‌గౌడ్, ఎస్టీఎఫ్ జిల్లా కన్వీనర్ రమేశ్, పెంటయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ అక్బర్, కిరణ్, మహేందర్‌రెడ్డి, ఎస్టీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, రామచంద్రయ్య, టీయూటీఎఫ్ అధ్యక్షుడు సునందం, ఉపాధ్యాయ సంఘాల కార్యవర్గ సభ్యులు గోలవంత, బుగ్గ రాములు, లాలయ్య, యాదగిరి, ప్రవీణ్, కృష్ణ, పరమేష్, శ్రీనివాస్, మధునాచారి, తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణ చట్టానికి తూట్లు
శ్రీకాకుళం అర్బన్: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు యాజమాన్యం పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాకరాపల్లి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోరాట కమిటీ ప్రతినిధి తాండ్ర ప్రకాష్ మాట్లాడారు. కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం సాగిస్తున్న చట్టవిరుద్ధ నిర్మాణాలను క్రమబద్ధీకరించడానికి పర్యావరణ మంత్రిత్వశాఖ ఐదుగురితో సబ్‌కమిటీని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాకరాపల్లి ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం మొదటి నుంచి అబద్దాలతో, మోసాలతో పాలకపార్టీల నాయకులను లోబరుచుకోవడం, అధికారులను లొంగదీసుకోవడం, చట్టవిరుద్ధ చర్యలను యథేచ్ఛగా సాగించడం వంటివి చేస్తోందన్నారు. పంట భూములు, చిత్తడి నేలల్లో ప్లాంట్లు కట్టరాదనే ప్రభుత్వాల జీవోలను ఉల్లంఘించిందన్నారు. పెద్ద ఎత్తన తాగునీటిని, సాగునీటిని అందిస్తూ, వేలాది మత్స్యకారుల కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తూ వస్తున్న చిత్తడి నేలల్లో బీల భూములను భంజరు భూములుగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. పోరాట కమిటీ ప్రతినిధి ఎ.హన్నూరావు మాట్లాడుతూ ప్లాంట్ నిర్మాణంతో వేలాది ఎకరాల్లో ఉప్పు పండించే 10 వేల మంది రైతులు జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.థర్మల్‌ప్లాంట్ ప్రభావం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తేలినీలాపురం వలస పక్షుల విడిది కేంద్రంపై పడే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణ అనుమతి ఉల్లంఘనను క్రమబద్ధీకరించుకునేందుకు ఐదుగురితో సబ్‌కమిటీని రూపొందించుకుందని విమర్శించారు. ఈ కమిటీ ఈనెల 24వ తేదీ సాయంత్రం 5గంటలకు విశాఖపట్టణం చేరుకుని 25, 26 తేదీల్లో పరిశీలనకు రానున్నదని పేర్కొన్నారు. బాదిత రైతాంగం, మత్స్యకారులు, ఉప్పురైతులు, పర్యావరణకారులు, మేధావులు స్పందించి ఈ సబ్ కమిటీకి వాస్తవాలను వివరించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పోరాటకమిటీ ప్రతినిధులు ఎం.నరసింగరావు, ఎన్.వెంకటరావు, ఎన్.ఎస్.విజయ్‌కుమార్, కె .వి.జగన్నాథరావు, మార్పు మల్లేశ్వరరావు, పోరాట కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘సమైక్య’శక్తి
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా జిల్లా జేఏసీ ఇచ్చిన 48 గంటల బంద్ విజయవంతంగా ముగిసింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీఓ, ఆర్టీసీ, పొలిటికల్, నాన్ పొలిటికల్ సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రెండోరోజైన గురువారం కూడా జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. అన్నివర్గాల వారూ ఏకమై ‘సమైక్య’శక్తిని చాటారు. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంక్‌లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వినూత్న నిరసనలు కొనసాగాయి. మచిలీపట్నంలో ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. పట్టణ కూరగాయలు, ఆకుకూరలు, నిమ్మకాయల వ్యాపారులు వంటావార్పు నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన గేటు ఎదుట న్యాయశాఖ జేఏసీ ఉద్యోగులు తాడాటతో నిరసన తెలిపారు. గుడివాడ పట్టణంలో భారీ మానవహారం నిర్వహించారు. అన్ని షాపుల యజమానులు, కర్షకులు, ముఠా కార్మికులు ఎక్కడివారు అక్కడే రోడ్లపైకి వచ్చి మానవహారంగా ఏర్పడి సమైక్యవాదానికి మద్దతు తెలిపారు. పామర్రు సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు రిలేదీక్షల్లో పాల్గొన్నారు. కంచికచర్ల మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా జాతీయ రహదారి పక్కన ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. మైలవరంలో 250 మంది రిలేదీక్ష.. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో 250 మంది రిలే దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, ఎన్జీఓ, ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ సమితి అధ్వర్యంలో శత జన రిలే నిరాహార దీక్షకు పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో 250 మంది పాల్గొని మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ యూత్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి షాపులు మూయించారు. జి.కొండూరులో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు 18వ రోజుకు చేరాయి. వీటీపీఎస్ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు 16వ రోజుకు చేరుకున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆటోలు సైతం నిలిపివేయడంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. నందిగామలో నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు, బంద్, రిలే నిరాహార దీక్షలతో సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. వైఎస్సార్ సీపీ జిల్లా వాణిజ్య విభాగ కన్వీనర్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు.. విద్యుత్ అధికారులు, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లటంతో ఉద్యమం ఉధృతమైంది. ఈఈ నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు సమ్మెలో పాల్గొనడంతో సేవలు బంద్ అయ్యాయి. జగ్గయ్యపేట పట్టణంలో మున్సిపల్ కూడలి వద్ద అఖిలపక్ష, ఎన్జీవో, రెవెన్యూ, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు పట్టణంలో రోడ్లపై వెనక్కి నడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరులో విద్యార్ధులు ఎంఎన్కే రహదారిపై ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఆడి నిరసన తెలిపారు. నందివాడ మండలంలోని జనార్థనపురం శివారు టెలిఫోన్‌నగర్ కాలనీలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు ఎంఎన్కే రహదారిపై పొర్లుదండాలు పెట్టి వినూత్న నిరసన చేపట్టారు. గుడివాడలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె నెలరోజులు గడిచిన నేపథ్యంలో ఎన్జీఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రోడ్లపై భిక్షాటన చేసి నిరసన తెలిపారు. ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు పూర్తిస్థాయిలో సమ్మెలోకి దిగారు. 72 గంటల పాటు సమ్మె కొనసాగుతుందని జేఏసీ నాయకులు ప్రకటించారు. సమ్మెలోకి దిగిన ఎన్టీటీపీఎస్ ఉద్యోగులందరూ గురువారం ఉదయం 6 గంటలకల్లా థర్మల్ కేంద్రానికి వచ్చి మూడు గేట్లను మూసి వేయించి ఉద్యోగులు ఎవరూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పెడన పట్టణంలో జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. బంటుమిల్లి చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. పామర్రులో షటిల్ ఫ్రెండ్స్సర్కిల్ వారి ఆధ్వర్యంలో జాతీయరహదారిపై బ్యాడ్మింటన్ ఆడి తమ నిరసన తెలిపారు. విజయవాడలో రెండురోజుల విజయవంతమైంది. బైక్‌ర్యాలీలు, వంటావార్పు, మానవహారాలు, రిలేదీక్షలతో నిరసనలు తెలిపారు. సివిల్ సప్లయిస్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ఎన్జీవో జేఏసీ నాయకులు జేసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.