సాక్షి, నంద్యాల జిల్లా: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై రేపు(శుక్రవారం) నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఢిల్లీ నుంచి నారా లోకేష్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా?. లోకేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.?. లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా?. ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా?. చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు?. భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు?. ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా?. అనే దానిపై చర్చించనున్నట్లు తెలిసింది.
లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా?, బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్‌లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు?. జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు?. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు?’’ అనేది హాట్ టాపిక్‌గా మారింది.
చదవండి: CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం
Comments
Please login to add a commentAdd a comment