జోనల్ వ్యవస్థ రద్దు తగదు
చేవెళ్ల రూరల్: జోనల్ వ్యవస్థను రద్దు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తప్పు బట్టింది. జోనల్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రెండు జోన్‌ల సంఖ్యను ఆరుకు పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. చేవెళ్ల మండల విద్యా వనరుల కేంద్రంలో సోమవారం సాయంత్రం ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో చర్చ వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ జోనల్ రద్దుతో నిరుద్యోగులతో పాటు ప్రస్తుత ఉద్యోగులకు బదిలీలు, ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు మరింతగా వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. హైదరాబాద్ జిల్లాను ఒక జోన్‌గానూ, మిగతా జిల్లాలను ఐదు జోన్లుగా విభజించాలని కోరారు.
రాష్ట్ర స్థాయి పోస్టులకు అన్ని జిల్లాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు అవకాశం ఉండేలా నిబంధనలు రూపొందించాలని డిమాండ్ చేశారు. జోన్ల సంఖ్యను పెంచడానికి నిపుణులతో కమిటీ వేసి పునర్‌వ్యవస్థీకరిచాలని...అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఎస్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు యు.పోచయ్య, స్థానిక ఎంఈఓ సుజాత, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.మానిక్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి గాలయ్య, జిల్లా కార్యదర్శి రవీందర్‌గౌడ్, ఎస్‌టీఎఫ్ జిల్లా కన్వీనర్ రమేశ్, పెంటయ్య, యూటీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మహమ్మద్ అక్బర్, కిరణ్, మహేందర్‌రెడ్డి, ఎస్‌టీఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ, రామచంద్రయ్య, టీయూటీఎఫ్ అధ్యక్షుడు సునందం, ఉపాధ్యాయ సంఘాల కార్యవర్గ సభ్యులు గోలవంత, బుగ్గ రాములు, లాలయ్య, యాదగిరి, ప్రవీణ్, కృష్ణ, పరమేష్, శ్రీనివాస్, మధునాచారి, తదితరులు పాల్గొన్నారు.