రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం | Rajeev Shukla will continue as the Chairman of IPL: Vinod Rai | Sakshi
Sakshi News home page

రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం

Published Thu, Mar 30 2017 7:56 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM

రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం

రాజీవ్ శుక్లాకు తప్పిన పదవీగండం

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చైర్మన్ గా రాజీవ్ శుక్లా కొనసాగనున్నారు. బీసీసీఐ వ్యవహారాలు పర్యవేక్షించడానికి వినోద్ రాయ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ ఆయనకు పచ్చజెండా ఊపింది. శుక్లాను తొలగించే అవకాశముందని మీడియాలో ఊహాగానాలు వచ్చాయి.

రాజీవ్ శుక్లా పదవికి ముప్పు వాటిల్లకపోవడంతో ఐపీఎల్ చైర్మన్ గా కొత్త వ్యక్తిని నియమించే అవకాశం లేదని తేలిపోయింది. అయితే ఐపీఎల్ పాలక మండలి కార్యకలాపాలను అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ పర్యవేక్షించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement