న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్‌మోడీ, ఆయన భార్య మినాల్ మోడీలకు స్విట్జర్లాండ్ నోటీసులు జారీ చేసింది. నల్లధనంపై పోరులో భాగంగా ఈ దంపతుల డిపాజిట్ వివరాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం స్విట్జర్లాండ్‌ను కోరడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 2010లో దేశం నుంచి లండన్‌కు పారిపోయిన లలిత్‌మోడీ ఇప్పటికే మనీల్యాండరింగ్ కేసులను ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వం కోరిన సమాచారం విషయంలో తమ స్పందన తెలియజేసేందుకు లలిత్‌మోడీ దంపతులకు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ విభాగం పది రోజుల గడువు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment