Lalit Kumar Modi Opens Up About His Relationship With Sushmita Sen, Says Not Yet Married - Sakshi
Sakshi News home page

Sushmita Sen - Lalit Kumar Modi: మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌తో సుష్మితా సేన్‌ డేటింగ్‌

Published Thu, Jul 14 2022 8:27 PM | Last Updated on Fri, Jul 15 2022 8:37 AM

Sushmita Sen Married To Lalit Kumar Modi - Sakshi

మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్‌ మరోసారి ప్రేమలో పడింది. మాజీ ఐపీఎల్‌ చైర్మన్‌ లలిత్‌ మోదీతో డేటింగ్‌ చేస్తోంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు లలిత్‌. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్‌ చేశాడు.

'మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నా. నా జీవిత భాగస్వామి సుష్మిత సేన్‌తో కొత్త జీవితం ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని రాసుకొచ్చాడు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారేమోననుకున్న నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు. కాసేపటికే లలిత్‌ మోదీ తమ పెళ్లి గురించి క్లారిటీ ఇస్తూ.. 'ప్రస్తుతానికి తామింకా డేటింగ్‌లోనే ఉన్నామని, ఒక్కరోజులోనే ఒకరితో ఒకరం ప్రేమలో పడిపోయాం' అని చెప్పుకొచ్చాడు.

కాగా సుష్మితా సేన్‌ మొదట్లో పాక్‌ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌తో ప్రేమాయణం నడిపింది. వీరిద్దరూ సహజీవనమూ మొదలుపెట్టారు. కానీ క్షణం తీరికలేని సుష్మితా‌ షెడ్యూల్‌ వల్ల వసీమ్‌ తీవ్రమైన అభద్రతకు లోనయ్యాడట. అంతేకాదు ఆ అభద్రత అతనిలో ఆమె పట్ల అనుమానాలను రేకెత్తించి.. సుష్మితాను చిరాకు పరచే వరకు వెళ్లింది. దాంతో ఆ అనుబంధం పెళ్లి దాకా వెళ్లకుండానే బ్రేక్‌ అయింది. కొన్నాళ్ల తర్వాత..  సుష్మితా సేన్‌ ప్రముఖ మోడల్‌ రోహ్‌మన్‌తో ప్రేమలో పడింది. కానీ అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.

చదవండి: గ్లామర్‌ తప్ప యాక్టింగ్‌ రాదంటూ టార్చర్‌ పెట్టారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement