సుష్మా వెంటనే రాజీనామా చేయాలి
న్యూఢిల్లీ: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు ఎదుర్కొంటున్న ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా మంజూరు చేయాలని ఏ విధంగా సిఫార్సు చేస్తారని సుష్మాను...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. ఆదివారం న్యూఢిల్లీలో సుష్మా స్వరాజ్ వైఖరిపై దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. నైతికత ఆధారంగా సుష్మా వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సిఫార్సు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే లలిత్ మోదీ భార్య గతకొద్ది కాలంగా కాన్సర్తో బాధపడుతున్నారు. అందుకు వైద్య చికిత్స కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులోభాగంగానే తాను మానవత్వంతోనే వారికి సహాయం చేసినట్లు సుష్మా స్వరాజ్ వివరణ ఇచ్చినట్లు సమాచారం.