జైపూర్: ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి పోటీ చేసిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్‌సీఏ) ఎన్నికలు గురువారం జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 6న వెల్లడి కానున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన పరిశీలకులు జస్టిస్ ఎన్‌ఎమ్ కస్లీవాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి.
ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసి పూర్తి నివేదికతో ఆయన సుప్రీం కోర్టుకు పంపించారు. జనవరి 6న విచారణ అనంతరం ఫలితాలు రానున్నాయి. మరోవైపు... తమ ఎన్నికల్లో నిషేధిత లలిత్ మోడిని అనుమతిస్తే వేటు తప్పదని బీసీసీఐ హెచ్చరించిన నేపథ్యంలో ఆర్‌సీఏ స్పందించింది. ‘రాజస్థాన్ క్రీడా చట్టం-2005 ప్రకారమే ఆర్‌సీఏ తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అలాగే సుప్రీం కోర్టులో దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్ ఆధారంగా ఈ ఎన్నికలు జరిగాయి’ అని బోర్డుకు లేఖ రాసింది.
6న ఆర్‌సీఏ ఎన్నికల ఫలితాలు
Published Fri, Dec 20 2013 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM
Advertisement