'ఇటలీ మాఫియారాణికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది'
పార్లమెంటులో చర్చ మొత్తం తనమీదే సాగుతున్న తరుణంలో.. లలిత్ మోదీ మరో బాంబు పేల్చారు. ఇటాలియన్ మాఫియా రాణికి తాను డబ్బు ఇచ్చి ఉండాల్సిందని, ఆ డబ్బును తనకు అప్పు ఇవ్వాల్సిందిగా వరుణ్ గాంధీని అడిగి ఉండాల్సిందని ట్వీట్ చేశారు. ఇటాలియన్ ఆంటీకి లలిత్ మోదీ 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే.. ఈరోజు పార్లమెంటు సజావుగా సాగి ఉండేదంటూ ఓ ఫాలోవర్ ఇచ్చిన ట్వీట్కు సమాధానంగా లలిత్ మోదీ స్పందించారు. తనకు ఓ కప్పు టీ కోసం సంతకం చేసేంత శక్తి లేదని, కేవలం డబ్బు తీసుకొచ్చే శక్తి మాత్రమే ఉందని తెలిపారు. అయితే అలా తాను తెచ్చిన డబ్బును క్రికెట్ మాఫియా ఖర్చు పెడుతుందని వ్యాఖ్యానించారు.
తాను 1987లో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు.. శ్రేయోభిలాషులు ముందుగా వెళ్లి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని కలిసి ఓ కప్పు టీ తాగాలని చెప్పారని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తనను అక్కడకు కెప్టెన్ సతీష్ శర్మ తీసుకెళ్లారని, కావాలంటే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోడానికి ప్రధానమంత్రి ఇంటి రికార్డులు సరిచూసుకోవచ్చని సవాలు చేశారు. తర్వాత కెప్టెన్కు సూట్కేసు ఇవ్వాల్సిందిగా చెప్పారని, తాను అలాగే ఇచ్చినని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వ్యాపారం అలా చేస్తారని లలిత్ మోదీ తెలిపారు. కావాలంటే వాళ్లు దీన్ని ఖండించుకోవచ్చని.. అయితే ఏదైనా చేసేముందు ప్రధాని ఇంటి రికార్డులు చెక్ చేసుకోవాలని అన్నారు. తన ఎంట్రీ అందులో రికార్డు అయి ఉంటుందని స్పష్టం చేశారు. కావాలంటే కెప్టెన్ లేదా ఇటాలియన్ దీన్ని ఖండించుకోవచ్చన్నారు. ఇక ఎవరైనా ఢిల్లీలోని సతీష్ శర్మ ఇంటికి వెళ్తే, ఆయన వాళ్లను గర్వంగా ఒక గదిలోకి తీసుకెళ్లి చూపిస్తారని, అందులో కింద ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ వరకు అంతా డబ్బు నిండి ఉంటుందని లలిత్ మోదీ ఆరోపించారు.
True. I should have asked @varungandhi80 to loan it to me. Then all would have been happy and Italian mafia queen