IPL scam
-
విచారణ జరగాలి: వైఎస్సార్సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఐపీఎల్ కుంభకోణంపై సమగ్రమైన విచారణ జరగాలని వైఎస్సార్సీపీ కేంద్రాన్ని కోరింది. ఐపీఎల్ స్కాంపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ప్రవేశపెట్టిన వాయిదాతీర్మానంపై జరిగిన చర్చలో పార్టీ తరపున లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘ప్రజలు చాలా ఆశలతో ఎన్డీయేకు పట్టం కట్టారు. మేం కోరేదేంటంటే ప్రజాస్వామ్యంలో చర్చ జరగాలి. ఏదైనా తప్పు జరిగితే దానిపై విచారణ జరగాలి’ అని అన్నారు. దేశం నష్టపోయింది: టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం మాట్లాడుతూ. కాంగ్రెస్ సభను నడవకుండా చేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించిందన్నారు. ఒకవైపు పెద్దమ్మ, మరోవైపు చిన్నమ్మ టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఒకవైపు తెలంగాణ ఇచ్చిన పెద్దమ్మ.. (సోనియాగాంధీని ఉద్దేశించి), మరోవైపు చిన్నమ్మ(సుష్మాను ఉద్దేశించి..)ల ముందు మేం నిల్చున్నాం. సుష్మాస్వరాజ్ పొరపాటు చేసి ఉంటారని నాకు అనిపించడం లేదు.’ అని పేర్కొన్నారు. -
'ఇటలీ మాఫియారాణికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది'
పార్లమెంటులో చర్చ మొత్తం తనమీదే సాగుతున్న తరుణంలో.. లలిత్ మోదీ మరో బాంబు పేల్చారు. ఇటాలియన్ మాఫియా రాణికి తాను డబ్బు ఇచ్చి ఉండాల్సిందని, ఆ డబ్బును తనకు అప్పు ఇవ్వాల్సిందిగా వరుణ్ గాంధీని అడిగి ఉండాల్సిందని ట్వీట్ చేశారు. ఇటాలియన్ ఆంటీకి లలిత్ మోదీ 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటే.. ఈరోజు పార్లమెంటు సజావుగా సాగి ఉండేదంటూ ఓ ఫాలోవర్ ఇచ్చిన ట్వీట్‌కు సమాధానంగా లలిత్ మోదీ స్పందించారు. తనకు ఓ కప్పు టీ కోసం సంతకం చేసేంత శక్తి లేదని, కేవలం డబ్బు తీసుకొచ్చే శక్తి మాత్రమే ఉందని తెలిపారు. అయితే అలా తాను తెచ్చిన డబ్బును క్రికెట్ మాఫియా ఖర్చు పెడుతుందని వ్యాఖ్యానించారు. తాను 1987లో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు.. శ్రేయోభిలాషులు ముందుగా వెళ్లి నాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని కలిసి ఓ కప్పు టీ తాగాలని చెప్పారని లలిత్ మోదీ ట్వీట్ చేశారు. తనను అక్కడకు కెప్టెన్ సతీష్ శర్మ తీసుకెళ్లారని, కావాలంటే ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోడానికి ప్రధానమంత్రి ఇంటి రికార్డులు సరిచూసుకోవచ్చని సవాలు చేశారు. తర్వాత కెప్టెన్‌కు సూట్‌కేసు ఇవ్వాల్సిందిగా చెప్పారని, తాను అలాగే ఇచ్చినని అన్నారు. కాంగ్రెస్ వాళ్లు వ్యాపారం అలా చేస్తారని లలిత్ మోదీ తెలిపారు. కావాలంటే వాళ్లు దీన్ని ఖండించుకోవచ్చని.. అయితే ఏదైనా చేసేముందు ప్రధాని ఇంటి రికార్డులు చెక్ చేసుకోవాలని అన్నారు. తన ఎంట్రీ అందులో రికార్డు అయి ఉంటుందని స్పష్టం చేశారు. కావాలంటే కెప్టెన్ లేదా ఇటాలియన్ దీన్ని ఖండించుకోవచ్చన్నారు. ఇక ఎవరైనా ఢిల్లీలోని సతీష్ శర్మ ఇంటికి వెళ్తే, ఆయన వాళ్లను గర్వంగా ఒక గదిలోకి తీసుకెళ్లి చూపిస్తారని, అందులో కింద ఫ్లోర్ దగ్గర నుంచి సీలింగ్ వరకు అంతా డబ్బు నిండి ఉంటుందని లలిత్ మోదీ ఆరోపించారు. True. I should have asked @varungandhi80 to loan it to me. Then all would have been happy and Italian mafia queen -
సుష్మ భర్తకు డెరైక్టర్ పదవి!
-
సుష్మ భర్తకు డైరెక్టర్ పదవి!
సొంత కంపెనీలో స్వరాజ్ కౌశల్‌కు డైరెక్టర్ షిప్ ఆఫర్ చేసిన లలిత్ మోదీ సోనియా ద్వారా నా ఇష్యూస్‌ని వరుణ్ గాంధీ సెటిల్ చేస్తానన్నారు మోదీ సంచలన ట్వీట్; ఖండించిన బీజేపీ నేత వరుణ్ న్యూఢిల్లీ: ‘లలిత్‌గేట్’లో మరో మలుపు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుటుంబంతో ఐపీఎల్ స్కామ్‌స్టర్ లలిత్ మోదీకున్న సంబంధాలకు సంబంధించిన అంశమొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. లలిత్ తండ్రి కేకే మోదీ చైర్మన్, ఎండీగా ఉన్న ఇండోఫిల్ ఇండస్ట్రీస్ సంస్థలో డైరెక్టర్ పదవి ఇస్తామని సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్‌కు లలిత్ ప్రతిపాదించారన్న వార్త తాజా వివాదాన్ని మరింత పెంచింది. ఆ వార్త నిజమేనని, అయితే, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించానని స్వరాజ్ కౌశల్ వివరణ ఇచ్చారు. అలాగే, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పరిశీలనకు రాకముందే ఆ ప్రతిపాదనను లలిత్ వెనక్కి తీసుకున్నారని కేకే మోదీ వివరణ ఇచ్చారు. మోదీ, సుష్మ కుటుంబాల మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఇది వెల్లడి చేస్తోందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. పోర్చుగల్ వెళ్లేందుకు లలిత్‌కు బ్రిటన్ నుంచి ట్రావెల్ డాక్యుమెంట్లు లభించేలా సుష్మ సహకరించిన కొన్ని నెలలకే ఆమె భర్త స్వరాజ్ కౌశల్‌కు డెరైక్టర్ పదవి ఆఫర్ చేశారని, ఇదంతా ఇద్దరికీ లబ్ధి చేకూరే డీల్‌లో భాగమేనని ఆరోపించింది. దీనిపై సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వాలని, ప్రధాని నరేంద్రమోదీ ఇప్పటికైన మౌనం వీడాలని డిమాండ్ చేసింది. విదేశాంగ మంత్రులుగా ఉండగా మాధవ్ సింగ్ సోలంకీ, నట్వర్ సింగ్‌లపై ఆరోపణలు వచ్చినప్పుడు.. తక్షణమే రాజీనామా చేయాలని వారిని కాంగ్రెస్ పార్టీ ఆదేశించిన విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా గుర్తు చేశారు. యూకే హైకమిషనర్ జేమ్స్ బేవన్తో సుష్మా స్వరాజ్ లలిత్ మోదీ ట్రావెల్ డాక్యుమెంట్స్ గురించి చర్చించినప్పటి సమావేశం పూర్తి వివరాలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ‘ఎవరైనా కేంద్ర మంత్రి బంధువుకు లలిత్ మోదీ ఇటీవల ఉద్యోగం ఆఫర్ చేశారా?, ఒకవేళ అదే నిజమైతే, అది ఎలాంటి జాబ్?’ అనే విషయంపై ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ శాశ్వత మౌన యోగాలో ఉన్నారని పార్టీ మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఎద్దేవా చేశారు. ‘ఎంతమంది బీజేపీ నేతలకు, ముఖ్యమంత్రులకు లలిత్ మోదీతో స్నేహపూర్వక, మానవతావాద, కుటుంబ సంబంధాలున్నాయో ప్రధాని చెప్పాలి’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘సుష్మ, రాజేలను తొలగించండి’ పరారీలో ఉన్న నిందితుడు లలిత్ మోదీకి సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మ, రాజస్తాన్ సీఎం వసుంధర రాజేలను తక్షణమే పదవుల్లోనుంచి తొలగించాలని సీపీఐ డిమాండ్ చేసింది. విద్యార్హతల విషయంలో పరస్పర విరుద్ధ విషయాలను వెల్లడించిన ఇరానీపై చర్యలు తీసుకోవాలంది. చండీగఢ్‌లో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ఆమోదించిన 4 తీర్మానాల్లో సుష్మ, రాజేల తొలగింపునకు సంబంధించిన తీర్మానమూ ఒకటి. రోజుకో కొత్త వార్త బయటపడుతున్న నేపథ్యంలో.. మొత్తం లలిత్ వ్యవహారంపై కోర్టు నియమిత ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఆరు కోట్ల డాలర్లు అడిగారు..! ‘లలిత్‌గేట్’లోకి తాజాగా వరుణ్‌గాంధీని లలిత్ మోదీ లాగారు. కొన్నేళ్ల క్రితం వరుణ్ లండన్‌లోని తన ఇంటికి వచ్చి, సోనియాగాంధీ ద్వారా తన సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిపాదించారంటూ లలిత్ బుధవారం వరుస ట్వీట్లు వదలడంతో కొత్త వివాదానికి తెర లేచింది. ఆ వార్తలు నిరాధారమని, ఆ మతిలేని ఆరోపణలకు స్పందించడం తన స్థాయికి తగనిదంటూ వరుణ్ తీవ్రంగా స్పందించారు. ‘వరుణ్ కొన్నేళ్ల క్రితం లండన్‌లోని మా ఇంటికొచ్చారు. కాంగ్రెస్‌తో, తన ఆంటీ(పెద్దమ్మ) సోనియాగాంధీతో నా వ్యవహారాలను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. తన పెద్దమ్మ(సోనియా) సోదరిని కలవమని నాకు సూచించారు’ అని లలిత్ ట్వీట్ చేశారు. ‘ఆ తర్వాత ఆ ఇటలీ ఆంటీ 6 కోట్ల డాలర్లు(రూ. 381 కోట్లు) కావాలంటున్నారని మా కామన్ ఫ్రెండ్ నాకు చెప్పాడు. తర్వాత వరుణ్ నాకు ఫోన్ చేశారు. నేను కోపంగా ‘మీకు పిచ్చా? మీ పని మీరు చూసుకోండి’ అని చెప్పా. ఈ విషయాల్ని వరుణ్ ఖండించగలరా?’ అంటూ మరో ట్వీట్లో ఆరోపించారు. ‘మీ ఆంటీ(సోనియా గాంధీ) ఏం అడిగారో దయచేసి ప్రపంచానికి చెప్పండి. ప్రఖ్యాత జ్యోతిష్యుడైన, మనిద్దరికీ బాగా స్నేహితుడైన వ్యక్తే దీనంతటికి సాక్ష్యం. నిజం చెప్పండి. కొన్నేళ్ల క్రితం లండన్‌లోని రిట్జ్ హోటల్లో మీరున్నప్పుడు ఓసారి మా ఇంటికొచ్చారా, లేదా?’ అని వరుణ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ వదిలారు. ఈ ఆరోపణలను వరుణ్‌తో పాటు బీజేపీ కూడా ఖండించింది. ‘సోనియా, వరుణ్ వేర్వేరు పార్టీల వారు. వారిద్దరి కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధాలున్నాయో అందరికీ తెలుసు’ అని బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ అన్నారు. లలిత్ ఆరోపణలపై సోనియా గాంధీ జవాబివ్వాలని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. -
ఫిక్సింగ్పై విచారణ కమిటీలో గంగూలీ ?
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్కామ్‌పై భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ విచారణ జరపనున్నాడా ? జస్టిస్ ముద్గల్ సారథ్యంలోని కొత్త కమిటీలో దాదాకు చోటు దక్కనుందా ? స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కామ్‌పై విచారణకు సుప్రీం కోర్టు కొత్త కమిటీని ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పుడు గంగూలీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఐపీఎల్ స్కామ్‌పై విచారణ జరిపే కమిటీలో వివాదరహితుడైన ప్రముఖ మాజీ క్రికెటర్‌ను నియమించాలని గత మంగళవారం సుప్రీం కోర్టును జస్టిస్ ముకుల్ ముద్గల్ కోరారు. అంతేకాదు మాజీ క్రికెటర్ల పేర్లతో ఒక జాబితాను సుప్రీం ముందుంచినట్లు తెలుస్తోంది. ఇందులో గంగూలీ పేరు కూడా ఉన్నట్లు సమాచారం. మాజీ సెలెక్టర్, 1983 ప్రపంచకప్‌లో భారత జట్టు జయకేతనం ఎగరేయడంలో కీలకపాత్ర పోషించిన మొహిందర్ అమర్నాథ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చేవారం కొత్త కమిటీ ప్రకటన ? ఐపీఎల్ స్కామ్‌పై విచారణకు శుక్రవారమే కొత్త కమిటీని ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. దీంతో కొత్త కమిటీపై ధర్మాసనం వచ్చే వారం నిర్ణయం తీసుకోనుంది. సాకర్‌తో దాదా బిజీ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇకపై సాకర్‌తో బిజీ కానున్నాడు. ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్)లో కోల్‌కతా ఫ్రాంచైజీ సహ యజమాని అయిన గంగూలీ త్వరలో లిస్బన్ వెళ్లనున్నాడు. చాంపియన్స్ లీగ్‌లో ఫైనల్‌కు చేరిన ‘అట్లెటికో మాడ్రిడ్’ సాకర్ జట్టు యజమాని కోల్‌కతా ఫ్రాంచైజీలో భాగస్వామి కావడంతో వీరిరువురు ఐఎస్ఎల్లో తమ జట్టు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఈ నెల 6న కోల్‌కతా జట్టు పేరును ఆవిష్కరిస్తారు. -
పాకిస్థాన్ అంపైర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదు!
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముంబై పోలీసుల దర్యాప్తు తీరును సుప్రీం కోర్టు ప్యానెల్ తప్పుపట్టింది. ఈ కుంభకోణంలో అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేపట్టలేదని ముంబై పోలీసులను ముగ్గురు సభ్యుల ముకుల్ ముద్గల్ ప్యానెల్ ప్రశ్నించింది. ఈ కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన పాకిస్థానీ అంపైర్ ను దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఎలా అనుమతించారు అని కమిటీ నిలదీసింది. ముంబైలోని బెట్టింగ్ సిండికేట్ కు దావూద్ అండ ఉందని తెలిసినా దర్యాప్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు..ప్యానెల్ దృష్టికి ఎందుకు తీసుకురాలేదని కమిటీ అడిగింది. మే 15 తేదికి మూడు రోజుల ముందే రాజస్థాన్ రాయల్స్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని పాకిస్థానీ అంపైర్ అసద్ రావూఫ్ ఫోన్ కాల్ ద్వారా వెళ్లడైనా.. అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ప్రత్యక్ష పాత్ర ఉన్నా.. రావూఫ్ ను అదుపులోకి తీసుకోకపోవడంపై పలు అనుమానాల్ని కమిటీ లేవనెత్తింది.