విచారణ జరగాలి: వైఎస్సార్‌సీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ఐపీఎల్ కుంభకోణంపై సమగ్రమైన విచారణ జరగాలని వైఎస్సార్‌సీపీ కేంద్రాన్ని కోరింది. ఐపీఎల్ స్కాంపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత ప్రవేశపెట్టిన వాయిదాతీర్మానంపై జరిగిన చర్చలో పార్టీ తరపున లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ‘ప్రజలు చాలా ఆశలతో ఎన్డీయేకు పట్టం కట్టారు. మేం కోరేదేంటంటే ప్రజాస్వామ్యంలో చర్చ జరగాలి. ఏదైనా తప్పు జరిగితే దానిపై విచారణ జరగాలి’ అని అన్నారు.
దేశం నష్టపోయింది: టీడీపీ లోక్‌సభ పక్ష నేత తోట నర్సింహం మాట్లాడుతూ. కాంగ్రెస్ సభను నడవకుండా చేసి ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించిందన్నారు.
ఒకవైపు పెద్దమ్మ, మరోవైపు చిన్నమ్మ
టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఒకవైపు తెలంగాణ ఇచ్చిన పెద్దమ్మ.. (సోనియాగాంధీని ఉద్దేశించి), మరోవైపు చిన్నమ్మ(సుష్మాను ఉద్దేశించి..)ల ముందు మేం నిల్చున్నాం. సుష్మాస్వరాజ్ పొరపాటు చేసి ఉంటారని నాకు అనిపించడం లేదు.’ అని పేర్కొన్నారు.